బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. బోరున ఏడ్చిన మోనాల్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్
టెలివిజన్ చరిత్రలో పాపులరైన తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ మోనాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని గత కొంతకాలంగా అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులు నిన్నటి నామినేషన్ ప్రక్రియలో జరిగిన రచ్చ చూసి అది కన్ఫామ్ చేసుకున్నారు. బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిద్దాం అనుకుంటే అది రకరకాల మలుపులు తిరుగుతూ చివరకు మోనాల్ కోసం అఖిల్, అభిజిత్ కొట్టుకునే పరిస్థితి దాకా వెళ్ళింది.

బోరున ఏడ్చేసిన మోనాల్ .. క్షమించమని కోరిన అఖిల్, అభిజిత్
దీంతో మోనాల్ తన పేరు తియ్యొద్దు అంటూ, ఇది నేషనల్ మీడియా తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేయొద్దంటూ లబోదిబోమంటూ ఏడుపు లంకించుకుంది. పదేపదే మోనాల్ పేరు తీసుకొచ్చి వారిద్దరు పెద్ద ఎత్తున ఘర్షణ పడటంతో తన క్యారెక్టర్ తో ఆటలాడవద్దని తన క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికి మీరెవరు అని రచ్చ చేసేసింది మోనాల్ . బోరున ఏడుస్తున్న మోనాల్ ను గంగవ్వ ఓదార్చింది . అనవసరంగా మోనాల్ మనసును బాధపెట్టామే అని భావించిన అఖిల్, అభిజిత్ ఆమెను క్షమించమని కోరారు.

సోషల్ మీడియాలో మోనాల్ పై చర్చ
నిన్నటి ఎపిసోడ్ తో మోనాల్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మోనాల్ పేరు తీసి ఏడిపించి మళ్లీ క్షమించమని అడుగుతారా అంటూ కొందరు నెటిజన్లు మోనాల్ పక్షం తీసుకొని ఫైర్ అవుతుంటే, మరికొందరు ఈ గొడవ ఇక్కడకు రావడానికి మూలకారణం మోనాల్ నే అని విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటినుంచి ఇద్దరితో డిఫరెంట్ వే లో లవ్ ట్రాక్ నడిపించింది మోనాల్ కాదా అంటూ చర్చిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ కు ఇద్దరు బిగ్ బాస్ లు .. నెటిజన్లు సెటైర్లు
ఇద్దరితో ఒకేసారి మాట్లాడకుండా ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతూ అభి ఏమంటున్నాడో అఖిల్ తో, అఖిల్ ఏమంటున్నాడో అభిజిత్ తో చెప్తూ గేమ్ ఆడింది మోనాల్ కదా అంటూ చర్చిస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ తో చాలామంది ఇది బిగ్ బాస్ షో కాదు మోనాల్ షో అని కొందరంటుంటే, అందరికీ ఒకటే బిగ్ బాస్ అయితే హౌస్ లో మోనాల్ కు ఇద్దరు బిగ్ బాస్ లు అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. స్టోర్ రూమ్ లో అభి కే ఐ లైక్ యూ అని చెప్పడం,అభి ఆ విషయాన్ని హౌస్ మేట్స్ అయిన దివి, హారిక లతో పంచుకోవడం, ఆ తర్వాత నుండి వాళ్లు సెటైర్లు వేయడం జరుగుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ కామన్ .. మోనాల్ వ్యవహారం ఏమవుతుందో ?
నాగార్జున వారాంతంలో ఇదే విషయాన్ని అడగడంతో మోనాల్ పరువు గంగలో కలిసిపోయింది. మొత్తానికి నిన్న హౌస్ లో జరిగిన రచ్చకు కారణం మోనాల్ అని , ఆమె స్వయంకృతాపరాధమే అని నెటిజన్లు తేల్చేస్తున్నారు . బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏ సీజన్ అయినా లవ్ ట్రాక్స్ కామన్ గా మారాయి. గత ఎపిసోడ్ లో రాహుల్, పునర్నవి లవ్ ట్రాక్ చర్చనీయాంశం అయింది . ఇప్పుడు మోనాల్ వ్యవహారం రచ్చగా మారింది. చూడాలి మరి ఈ వ్యవహారం ముందు ముందు ఎలా మారుతుందో!!
-
ఈ అడవిలో దాగి ఉన్న చిన్న ఎలుగుబంటి ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!












Click it and Unblock the Notifications