టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్; ఆ సవాల్ తో నంద్యాలలో టెన్షన్!!

టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, బహిరంగ చర్చకు రావాలని శిల్పా రవికి చేసిన సవాల్ తో నంద్యాలలో టెన్షన్ చోటు చేసుకుంది.

ఒకపక్క నెల్లూరు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపుతుంటే మరోపక్క కర్నూలు నంద్యాల రాజకీయాలు కూడా రచ్చగా మారాయి. ఎమ్మెల్యే శిల్పా రవికి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య వార్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే శిల్పా రవి బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిల ప్రియ సవాల్ చేయడంతో ఒక్కసారిగా నంద్యాల రాజకీయాలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.

బహిరంగ చర్చకు సవాల్ చేసిన భూమా అఖిలప్రియ

బహిరంగ చర్చకు సవాల్ చేసిన భూమా అఖిలప్రియ

ఈరోజు నంద్యాలలో బహిరంగ చర్చకు రావాలని, సాయంత్రం నాలుగు గంటలకు గాంధీచౌక్ వద్ద చర్చకు రావాలని భూమా అఖిలప్రియ ఏర్పాట్లు చేస్తుండడంతో భూమా అఖిలప్రియ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.30 యాక్ట్ అమలులో ఉన్న కారణంగా బహిరంగ చర్చకు అనుమతి లేదని, పోలీసుల అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న కారణంగా ఎందుకు చర్య తీసుకోరాదని భూమా అఖిలప్రియకు, భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకునికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భూమా అఖిలప్రియ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భూమా అఖిలప్రియ వర్సెస్ శిల్పా రవి

భూమా అఖిలప్రియ వర్సెస్ శిల్పా రవి

నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి భూమా అఖిల ప్రియపై ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నంద్యాల రాజకీయాల్లో భూమా అఖిల ప్రియ యాక్టివ్ గా మారుతున్న నేపధ్యంలో ఆయన అఖిలను టార్గెట్ చేశారు. దీంతో శిల్పా రవి చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆధారాలతో చర్చకు రావాలని భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. నంద్యాలలో అవినీతి, అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ చేసిన భూమా అఖిలప్రియకు నంద్యాలలో ఆస్తుల ఆక్రమణ, భూ దందాలు, సెటిల్మెంట్ లు, పంచాయతీలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని శిల్పా రవి కౌంటర్ ఇచ్చారు.

 టీడీపీతో టచ్ లో శిల్పా రవి, బాంబు పేల్చిన అఖిలప్రియ

టీడీపీతో టచ్ లో శిల్పా రవి, బాంబు పేల్చిన అఖిలప్రియ

ఇక భూమా అఖిలప్రియ శిల్పా రవి కుటుంబం టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారని, టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, శిల్పా రవి గురించి బాంబు పేల్చారు. శిల్పా రవి పచ్చ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వైసీపీలో శిల్పారవి కుటుంబ పరిస్థితి ఏమీ బాగోలేదని, పార్టీతో మంచి సంబంధాలు లేవని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తూ టిడిపి నేతలను విమర్శిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును తిడితే పార్టీలో ఎలా చేర్చుకుంటారో చెప్పాలని నిలదీశారు.

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ .. నంద్యాల లో పొలిటికల్ హీట్

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ .. నంద్యాల లో పొలిటికల్ హీట్

ఇక అంతే కాదు అవినీతి, అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ విసిరి అందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్న క్రమంలో పోలీసులు భూమా అఖిలప్రియ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి తాజాగా భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు నంద్యాలలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+