షార్ట్ ఫిలిం అంటూ వ్యభిచార వృత్తిలోకి... 8 మంది యువతులను రక్షించిన ఏపీ పోలీసులు
అమ్మాయిల ఆర్ధిక అవసరాలతో పాటు వ్యక్తిగత అభిలాషను అసరా చేసుకుంటున్న దుండగులు వారిని ఆసాంఘీక కార్యాకాలపాల్లోకి దింపుతున్నారు. దీంతో తాము మంచి వృత్తిలో స్థిరపడతామని వేల ఆశలతో బయటకు వస్తున్న మహిళలు ముఠాల మాయలోపడి బలి అవుతున్నారు. అనంతరం దుండగుల భారినుండి బయటపడేందుకు విలవిలలాడుతున్నారు. అయితే బాధితులు ఎవరో ఒకరు ధైర్యం చేసి బయటకు వస్తేగాని ఇలాంటీ మోసాలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏపీలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దింపుతున్నాడు. షార్ట్ ఫిల్మ్‌లలో అవకాశాలు ఇప్పిస్తానని యువతులు, ఇతర మహిళలను నమ్మబలికి వారిని నగరంలోని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాడు. నెల్లూరు నగరానికి చెందిన జాకీర్ అనే వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడడంతో జాకీర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

అయితే ఇదే తరహాలో ఓ అమ్మాయిని నమ్మించి వ్యభిచార వృత్తిలోకి దింపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఎనిమిది మంది యువతులను పట్టుకున్నారు. అనంతరం యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. కాగా నిందితుడు జాకీర్‌ను విచారించడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడిపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నట్టు పోలీసులకు తెలిసింది. దీంతో పలు సెక్షన్ల క్రింద కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications