నిజామాబాద్ లో కవితతో 184 మంది రైతుల వార్ .. బ్యాలెట్ ముద్రణ పై ఆధారపడి ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎన్నికలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి నిజామాబాద్ ను పెద్ద సంఖ్యలో రైతులు పోటీలో ఉండడంతో బ్యాలెట్ పోరు జరుగనుంది. ఇక రైతులు ఎవరైనా నామినేషన్ లు ఉపసంహరించుకునే లక్ష రూపాయలు జరిమానా విధించాలని తీర్మానం చేశారు రైతులు. దీంతో రైతులు ఎవరూ నామినేషన్ లు ఉపసంహరించుకునే అవకాశం లేదు అని భావించొచ్చు. ఇక ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన తరువాత 184 మంది రైతులు నిజామాబాద్ ఎన్నికల బరిలో కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత తలపడబోతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతుల్లో కలిగిన రాజకీయ చైతన్యానికి ప్రస్తుతం నిజామాబాద్ ఎన్నికలను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

నిజామాబాద్ బరిలో 191 మంది .. వారిలో రైతులు 184 మంది

తెలంగాణలో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు అయ్యాయి . రాష్ట్రంలోనే నిజామాబాద్ టాప్ గా నిలిచింది. 203 మంది 245 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన పూర్తయిన తర్వాత 191 నామినేషన్లను అనుమతించారు ఈసీ అధికారులు .12 మంది నామినేషన్లను తిరస్కరించారు. వీరిలో 184 మంది రైతులు ఉన్నారు. బీజేపీ నుండి అరవింద్ , కాంగ్రెస్ నుండి మధు యాష్కీ , టీఆర్ ఎస్ నుండి కవిత , జనసేన,పిరమిడ్ , సమాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ , బహుజన విముక్తి పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి.

184 farmers war with Kavitha in ​​Nizamabad .. The election based on ballot print

బ్యాలెట్ పేపర్లు సకాలంలో ముద్రణ జరిగితేనే 11 న ఎన్నికలు .. లేకుంటే వాయిదానే

మార్చి 28వ తేదీ గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా నిజామాబాద్ బరిలో అంతేమంది పోటీలో ఉంటే రిటర్నింగ్ అధికారి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ వాస్తవ పరిస్థితిని ఈసీకి తెలియజేస్తారు. ఎందుకంటె చాలా ఎక్కువ సంఖ్యలో పోటీలో అభ్యర్థులు ఉన్న కారణంగా నిజామాబాద్ లో బ్యాలెట్ పోరు జరగనుంది. అందుకోసం అదే రోజు లేదా మర్నాడు ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశం అవుతారు . వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే..యథావిధిగా ఏప్రిల్ 11నే పోలింగ్‌ జరుగుతుంది. లేదంటే నిజామాబాదు ఎన్నికలు వాయిదాపడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+