సరికొత్తగా.. వన్ ఇండియా: భిన్నత్వంలో ఏకత్వం
డిజిటల్ మీడియాలో పెను సంచలనం సృష్టించిన మల్టీ లింగ్వల్ వెబ్‌సైట్.. వన్ ఇండియా సరికొత్తగా తెరపైకి వచ్చింది. రీబ్రాండ్‌తో రీడర్స్ ముందుకొచ్చింది. దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్ ఇండియా మేనేజ్‌మెంట్.. కొత్త బ్రాండింగ్‌ను ఆవిష్కరించింది. There's only Oneindia అనేది ఈ వెబ్ పోర్టల్ ట్యాగ్ లైన్.
25 సంవత్సరాల కిందట..
1999లో తొలిసారిగా Indiainfo.com పేరుతో ఈ సంస్థ ఏర్పాటైంది. అనంతరం Oneindia పేరుతో 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. పాఠకుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ వచ్చింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో ఛాప్టర్‌ను ఆరంభించింది.

మొత్తం 10 భాషల్లో..
తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ.. భాషల్లో Oneindia న్యూస్ పోర్టల్ అందుబాటులో ఉంది. యూట్యూబ్, వాట్సప్ ఛానల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, మొబైల్ యాప్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అగ్రస్థానంలో నిలిచింది.
నిబద్ధతతో..
కంటెంట్‌ను రూపొందించడంలో నిబద్ధత, అంకితభావం Oneindia సొంతం. విలువైన, నమ్మకమైన వార్తా సమాచారాన్ని పాఠకులకు చేరవేస్తోండటమే దీనికి నిదర్శనం. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా రీడర్స్ కోరుకునే వార్తలను శరవేగంగా అందజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వారి ప్రాధాన్యతలకు అనుకూలమైన కంటెంట్‌ను అందించడం Oneindia ప్రత్యేకత.
కొత్త లోగో
కొన్ని సంవత్సరాల పాటు పాఠకులకు చిరపరిచితమైన Oneindia లోగో ఇప్పుడు మారింది. సరికొత్తగా, ఆకర్షణీయంగా, ఆధునికంగా మరింత డైనమిక్‌గా రూపుదిద్దుకుంది. బహు భాషా చైతన్యాన్ని సూచించేలా దీనికి రూపకల్పన చేసింది సంస్థ మేనేజ్‌మెంట్. వన్ఇండియా ఆత్మను వ్యక్తీకరించేలా ఆవిష్కృతమైంది. భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని ఇచ్చింది.
రికార్డు స్థాయిలో రీచ్..
200 మిలియన్లకు పైగా నెలవారీ యూనిక్ యూజర్స్‌ను నమోదు చేస్తోంది Oneindia. దేశంలో ప్రతి అయిదుమంది ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఒకరు Oneindiaను విజిట్ చేస్తోన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో దాదాపు 25 శాతం మందికి రీచ్ అయింది. ఇది- పాఠకుల్లో ఈ సంస్థకు ఉన్న ఆదరణ ఎలాంటిదో స్పష్టం చేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఓ కీ ప్లేయర్ పాత్రను పోషిస్తోంది.
డిజిటల్ ప్రపంచంలో..
యూజర్లు- అడ్వర్టయిజర్ల మధ్య ఓ వారధిలా వ్యవహరిస్తోన్న Oneindia ప్లాట్‌ఫారమ్.. విన్ టు విన్ ఫార్ములాను అనుసరిస్తోంది. వారి మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ ఉండే కంటెంట్‌ను ప్రతి ఒక్కరూ తమదిగా భావించే వాతావరణాన్ని సృష్టించడం, వారితో మరింత కనెక్టివిటీని కలిగివుండటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అందరికీ అన్నీ..
Oneindia అనేది ఓ అన్ని రంగాలకు చెందిన ఓ సమగ్ర వార్తల సమాహారం. ఫిల్మీబీట్- ఎంటర్‌టైన్‌మెంట్, డ్రైవ్‌స్పార్క్- ఆటోమోటివ్, గుడ్ రిటర్న్స్: ఫైనాన్స్, మైఖేల్- క్రీడలు, గిజ్‌బాట్- టెక్నాలజీ, నేటివ్ ప్లానెట్- పర్యాటకం, బోల్డ్‌స్కై- దైనందిన జీవనశైలి, కెరీర్ ఇండియా- విద్య- ఉద్యోగాలు, హిట్జ్ ఫీడ్- వైరల్ కంటెంట్‌ను అందిస్తోంది.












Click it and Unblock the Notifications