Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీకాకుళం ప్రమాదంలో పోలీసుల మృతిపై హోంమంత్రి, డీజీపీ సంతాపం-దర్యాప్తుకు ఆదేశం

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందడం పలువురిని కలిచి వేస్తోంది. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది. ఘటనపై సమాచారం అందగానే ఆరా తీసిన హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ పోలీసుల మృతికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రమాద కారణాలను ఆరా తీయడంతో పాటు సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

శ్రీకాకుళంలోని భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏఆర్ ఎస్సైతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఓ కానిస్టేబుల్ చనిపోయినట్లు సవాంగ్ ప్రకటించారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని డిజిపి సవాంగ్ ఆదేశించారు.

ap home minister and dgp condolences to srikakulam road accident deaths families

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్ జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటని డీజీపీ సవాంగ్ తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందన్నారు.

ap home minister and dgp condolences to srikakulam road accident deaths families

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబాలకు హోంమంత్రి సుచరిత ప్రఘాడ సానుభూతిని తెలిపారు. ఓ జవాను మృతదేహం అప్పగించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+