వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

137ఫేక్‌ లోన్ యాప్స్ జాబితా విడుదల.. ఈ యాప్ ల విషయంలో తస్మాత్ జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

ఆన్లైన్ లోన్ ల పేరిట నకిలీ యాప్ లు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నాయి. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తూ, ఆపై అధిక వడ్డీతో లోన్లు చెల్లింపు కోసం రుణ గ్రహీతలను మానసిక వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇక ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న చాలామంది వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యాప్ ఆధారిత మనీ లెండింగ్ సంస్థల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్న వారు, సదరు యాప్ ల గురించి ఫిర్యాదు చేయాలని పోలీసులు నిరంతరం రుణగ్రహీతలను కోరుతున్నారు.

ట్విట్టర్‌లో ఫేక్ లోన్ యాప్‌ల పూర్తి జాబితాను షేర్ చేసిన తెలంగాణా పోలీసులు

ట్విట్టర్‌లో ఫేక్ లోన్ యాప్‌ల పూర్తి జాబితాను షేర్ చేసిన తెలంగాణా పోలీసులు


కొద్దిరోజుల క్రితం యాప్ ఆపరేటర్ల వేధింపులు భరించలేక హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ ఆపరేటర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇటువంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు తన ట్విట్టర్‌లో ఫేక్ లోన్ యాప్‌ల పూర్తి జాబితాను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేసిన ట్వీట్ లో ఫేక్ లోన్ యాప్స్ జాబితాను వెల్లడించారు.

నకిలీ లోన్ యాప్స్ ను గుర్తించిన ఆర్బీఐ

నకిలీ లోన్ యాప్స్ ను గుర్తించిన ఆర్బీఐ

నకిలీ ఆన్లైన్ లోన్ యాప్స్ పై ఆర్బిఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాప్ ల లిస్టును విడుదల చేసింది. మొత్తం 600 వరకు ఈ తరహా లోన్ యాప్ లు ఉన్నట్టు గుర్తించిన ఆర్బిఐ, ప్రాథమికంగా 137 యాప్ ల లిస్టును రిలీజ్ చేసి, ఇటువంటి యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎవరైనా రుణాలు తీసుకోవాలి అనుకుంటే ఆర్బిఐ కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలా కాదా అనేది పరిశీలన చేసిన తర్వాత రుణాలు తీసుకోవాలని ఆర్బిఐ వెల్లడించింది.

నకిలీ లోన్ యాప్ లపై ఫిర్యాదుల వెల్లువ

నకిలీ లోన్ యాప్ లపై ఫిర్యాదుల వెల్లువ

ఆసక్తికరంగా, ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఈ చట్టవిరుద్ధమైన యాప్‌లను కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలో, అంటే జనవరి 1, 2021 మరియు ఫిబ్రవరి 28, 2021 మధ్య కాలంలోనే కనుగొంది. అదే సమయంలో, జనవరి 1, 2020 మరియు మార్చి 31, 2021 మధ్య ఇటువంటి డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ఆర్బీఐకి 2,562 ఫిర్యాదులు అందాయి. ఇక ప్రస్తుతం కూడా ఆన్ లైన్ లోన్ యాప్ లపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది.

ఇప్పటికే 27 చట్టవిరుద్ధమైన రుణాలు ఇచ్చే యాప్‌ లు బ్లాక్

ఇప్పటికే 27 చట్టవిరుద్ధమైన రుణాలు ఇచ్చే యాప్‌ లు బ్లాక్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద నోటిఫై చేయబడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ప్రజల కోసం సమాచార యాక్సెస్ కోసం నిరోధించే విధానం మరియు భద్రతలు) రూల్స్, 2009 నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 27 చట్టవిరుద్ధమైన రుణాలు ఇచ్చే యాప్‌లను ఇప్పటికే బ్లాక్ చేసింది. మోసం చేసే డిజిటల్ లెండింగ్ యాప్‌లపై వచ్చిన 2,562 ఫిర్యాదుల్లో అత్యధికంగా 572 ఫిర్యాదులు మహారాష్ట్ర నుంచి రాగా, కర్ణాటక (394), ఢిల్లీ (352), హర్యానా (314) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 మొత్తం 137ఫేక్ లోన్ యాప్స్ జాబితా విడుదల

మొత్తం 137ఫేక్ లోన్ యాప్స్ జాబితా విడుదల

ఇక తాజాగా ఆర్.బి.ఐ వెల్లడించిన ఫేక్ లోన్ యాప్ ల వివరాల్లోకి వెళితే యూపీఏ లోన్, రూపీ కింగ్, ఎమ్ఐ రూపీ, వన్ లోన్ క్యాష్ ఎనీటైం, గోల్డ్ మాన్ పే బ్యాక్, ఎక్స్ప్రెస్స్ లోన్, లోన్ డ్రీమ్, రూపీ లోన్, వావ్ రూపీ, లైవ్ క్యాష్, ఫాస్ట్ రూపీ, లోన్ ఫార్చ్యూన్, క్యాష్ ప్యాకెట్, రూపీ బాక్స్, స్మాల్ లోన్, లోన్ గో, ఆసాన్ లోన్, క్యాష్ అడ్వాన్స్, లెండ్‌ మాల్‌, సిల్వర్‌ ప్యాకెట్‌, భారత్‌ క్యాష్‌, ఇంస్టా లోన్, అప్నా పైసా, టైటో క్యాష్, క్యాష్ మైన్, మనీ మాస్టర్, ఈజీ లోన్, వార్న్ రూపీ, లోన్ క్యూబ్ , సింపుల్ లోన్, క్యాష్‌ మిషన్‌ లోన్‌, ఫర్‌ పే, మినిట్‌ క్యాష్‌, ఫాస్ట్‌ పైసా .. ఇలా మొత్తం 137 ఫేక్ లోన్ యాప్స్ ప్రజలను మోసం చేస్తున్నాయని వెల్లడించారు.

English summary
RBI has released a list of 137 fake loan apps. Telangana police say to be careful about these apps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X