అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్- చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రత

Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది.

14 Days remand for Allu Arjun security beefed up around Chanchalguda Jail

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త దావానలంలా వ్యాపించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బారులు తీరుతున్నారు. తొలుత ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్, భార్య స్నేహారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.

నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, నాగవంశీ, మైత్రీ రవి సహా పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ బాట పట్టారు. విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రీకరణను క్యాన్సిల్ చేసుకున్నారు. భార్య సురేఖతో కలిసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఫోన్ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అరెస్ట్ అయిన తరువాత కొద్దిసేపటికి ఆయనను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు కొనసాగాయి. డిశ్చార్జ్ చేసిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు.

నాంపల్లి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే శ్రీదేవి ముందు ఆయనను ప్రవేశ పెట్టారు. అల్లు అర్జున్ తరఫున ప్రముఖ న్యాయవాది జీ అశోక్ రెడ్డి తన వాదనలను వినిపించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలతో రేవతి మృతిచెందడం, దీనికి కారకుడిగా అల్లు అర్జున్‌‌ను పేర్కొంటూ అరెస్ట్ చేయడం వంటి పరిణామాలను వివరించారు.

వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించారు. దీనితో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+