నేడే విడుదల.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్న 213మంది ఖైదీలు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తీపి కబురు చెప్పింది. తెలంగాణా రాష్ట్రంలోని 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేయగా ప్రభుత్వం వారి విజ్ఞప్తిని మన్నించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ
ఈ మేరకు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు అర్హులైన వారి వివరాలను అధికారులు హైలెవల్ కమిటీ ముందుంచారు. ఈ కమిటీ ఆమోదించిన జాబితాను రాష్ట్ర మంత్రివర్గం ఈ ఖైదీల ముందస్తు విడుదలను ఆమోదించింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోదం కోసం పంపించారు.గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో 231 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

213మంది ఖైదీలు నేడు విడుదల
ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందనీ, ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. దీంతో, చర్లపల్లి జైలు నుంచి 213మంది ఖైదీలు ఈ రోజు విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, ఎనిమిది మంది దానికన్న తక్కువ శిక్షపడిన వారు. వీరందరికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. వారిలో పరివర్తన తీసుకువచ్చారు.
స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్న ఖైదీలు
వీరు జైలు నుండి బయటకు వెళ్ళినా వారు మెరుగైన జీవన విధానం కనబరుస్తారని జైలు అధికారులు చెప్తున్నారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలవటానికి వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్తున్నారు. ఈరోజు 213 మంది వివిధ నేరాలతో జైలు పాలైన, ఇంతకాలం జైలు జీవితాన్ని అనుభవించిన ఖైదీలకు, జైలు నుండి విముక్తి లభిస్తున్న కారణంగా వారంతా మళ్ళీ జన జీవన స్రవంతిలో కలవనున్నారు. స్వేచ్చా వాయువులు పీల్చుకోనున్నారు.
జైలు వద్ద కుటుంబ సభ్యుల నిరీక్షణ
తమ వారిని తిరిగి ఇళ్ళకు తీసుకు వెళ్లేందుకు జైలు వద్ద ఆయా క్షమాభిక్ష ఖైదీల కుటుంబ సభ్యులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తమ వారిని విడుదల చెయ్యాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైలు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వారిని నేడు జైలు అధికారులు విడుదల చెయ్యనున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications