50 వేల జంటలు: 3 నెలలు సుముహూర్తాలు, కానీ ఫోర్త్ వేవ్ టెన్షన్
కరోనా ఇంఫాక్ట్ అంతగా లేదు. గతేడాదితో పోలిస్తే బెటరే.. కానీ ఎండలు మాత్రం దంచికొడుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఫంక్షన్లకు అనువైన వాతావరణం నెలకొంది. ఇంకేముంది సుముహూర్తాలు ఎక్కువే ఉన్నాయి. నిలిచిన వివాహాలు.. జరగబోతున్నాయి. ఈ మే నెల నుంచి పెళ్లిళ్లకు సుముహుర్తాలు ఉన్నాయి. దీంతో ఎప్పటిలాగే ఫంక్షన్ల హాళ్లు బిజీ బిజీగా ఉండబోతున్నాయి.

ఆంక్షలతో వాయిదా..
కరోనా వల్ల పెళ్లి ముహూర్తాల సమయంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. పెళ్లిళ్ల హడావుడి పెద్దగా లేకపోవటంతో ఆయా రంగాలకు చెందిన వారు నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో జంటలు వివాహాలకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ నెలలో పలు జంటలు పెళ్లిళ్లు చేసుకోగా, మే, జూన్, జులై నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

కో రిస్ట్రిక్షన్స్.. ఇవే ముహూర్తాలు
తెలంగాణలో కొవిడ్ ఆంక్షలు లేవు. చైత్ర, వైశాఖ మాసాల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. మే, జూన్, జులై నెలల్లో రాష్ట్రంలో 50 వేల జంటలు ఒక్కటి కానున్నాయి. మే నెలలో 2, 3,4, 9, 10, 12, 18, 20, 21, 24, 26, 27 తేదీలు మంచిరోజులు కాగా, జూన్‌లో 1, 5, 6, 8, 10, 11, 14, 17, 20, 21, 22, 23 తేదీలు, జులైలో 03, 06, 07, 08, 09 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ముహార్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తాల్లో తెలంగాణ రాష్ట్రంలో జంటలు వివాహాలు చేసుకొనేందుకు సన్నద్దం అవుతున్నాయి.

కేసుల టెన్షన్
దేశంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుంది. ఆలస్యం చేస్తే మళ్లీ కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మే నెలలో పెళ్లి తంతు పూర్తయ్యేలా ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుంటున్నారు.

జూన్‌లో ఫోర్త్ వేవ్..?
ఈ సారి సమ్మర్ కాకుండా.. జూన్‌లో కేసులు పెరుగుతాయని ఖరగ్ పూర్ ఐఐటీ నిపుణులు అంచనా వేశారు. అప్పుడే ఫోర్త్ వేవ్ రావొచ్చనే అంచనా నెలకొంది. అందుకే ఇప్పటివరకు అన్నీ స్తబ్దుగా కొనసాగుతున్నాయి. ఫోర్త్ వేవ్ వచ్చే లోపు తమ వివాహాలు చేసుకోవాలని ఆయా జంటలు భావిస్తున్నాయి. ఆ మేరకు వారు షెడ్యూల్ చేసుకొని పెళ్లిళ్లు చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.












Click it and Unblock the Notifications