చిన్నారి ప్రాణం తీసిన అగ్గిపెట్టె.. ఆడుకుంటుండగా నిప్పంటుకుని..
చిన్నారి వేసుకున్న డ్రెస్ నైలాన్ వస్త్రంతో చేసింది కావడంతో.. అగ్గిపుల్లలు డ్రెస్ కు అంటుకుని శరీరమంతా కాలిపోయింది.
హైదరాబాద్: సరదా కోసం అగ్గిపెట్టెను చేతబట్టి ఆటలాడిన ఆ చిన్నారి.. చివరకు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. తల్లి ఇంట్లో లేని సమయంలో అగ్గిపుల్లలను మండిస్తూ ఆటలాడుకుంది. కానీ అదే అగ్గిపుల్ల తన డ్రెస్‌కు అంటుకోవడంతో.. శరీరమంతా కాలిపోయి ఆసుపత్రిలో మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జవహర్ నగర్ లో నివాసముండే గోవింద్, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె కె.దివ్య(5) స్థానికంగా నోబెల్ హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. శనివారం నాడు బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు గోవింద్ బెంగుళూరు వెళ్లాడు. కవిత పిల్లలతో ఇంట్లోనే ఉంది.

అయితే పాల ప్యాకెట్ కోసమని కవిత బయటకెళ్లిన సమయంలో చిన్నారి దివ్య అగ్గిపెట్టెతో ఆటలాడటం మొదలుపెట్టింది. చిన్నారి వేసుకున్న డ్రెస్ నైలాన్ వస్త్రంతో చేసింది కావడంతో.. అగ్గిపుల్లలు డ్రెస్ కు అంటుకుని శరీరమంతా కాలిపోయింది. బయటకెళ్లొచ్చిన కవిత చిన్నారిని చూసి షాక్ తింది.
స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. 90శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది. చిన్నారి దివ్యకు నిప్పంటుకున్న సమయంలో ఆమె చెల్లెలు, కవిత దంపతుల చిన్న కుమార్తె, పక్కన్నే నిద్రిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications