70ఏళ్ల మర్రిచెట్టుకు పునర్జన్మ: వర్షాలకు నేలకొరిగిన వృక్షం; సిరిసిల్ల కలెక్టరేట్ లో నాటిన ప్రకృతిప్రేమికులు
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ ప్రాణం పోసుకుంది. నేలకొరిగిన 70 ఏళ్ల భారీ వృక్షం మళ్లీ ఠీవిగా నిలబడింది. కోనరావుపేటలో భారీ వర్షాలకు కూలిన 70 ఏళ్ల మర్రి చెట్టుకు ప్రాణం పొయ్యాలి అన్న ప్రకృతి ప్రేమికుడి కృషి, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ చొరవ వెరసి 70 ఏళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద మర్రి వృక్షం ఇప్పుడు తెలంగాణ సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో తిరిగి ట్రాన్స్ ప్లాంట్ చేయబడింది.

భారీ వర్షాలకు నేలకొరిగిన 70 ఏళ్ల మర్రి చెట్టు
ఓ వ్యవసాయ భూమిలో ఉన్న మర్రిచెట్టు గతంలో కురిసిన వర్షాలకు నేలకొరిగిపోగా ప్రకృతి ప్రేమికుడు దెబ్బల ప్రకాష్ దానికి నీరు పోసి మళ్లీ చిగురించేలా చేశాడు. నాలుగు నెలల క్రితం ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ వ్యవసాయ భూమిలో 70 ఏళ్ల మర్రి చెట్టు నేలకూలింది. నీరు లేకపోవడంతో ఎండిపోయి చచ్చిపోయినట్లు కనిపించింది.

చిగురించేలా చేసిన ప్రకృతి ప్రేమికుడు, మర్రి చెట్టు కోసం రంగంలోకి సంతోష్, కేటీఆర్
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని నమ్మిన అదే గ్రామానికి చెందిన డాక్టర్ దొబ్బల ప్రకాష్ మనుషులకు మరియు పక్షులకు ఆశ్రయం ఇచ్చే మర్రి చెట్టు కూలిపోవడంతో కలత చెందాడు. తగినంత మొత్తంలో నీరు చెట్టుకు తిరిగి జీవం పోయగలదని అతను భావించాడు. ప్రకాష్ కృషితో మర్రిచెట్టు మళ్ళీ చిగురించింది. దానికి ఎలాగైనా ప్రాణం పోయాలని భావించిన అతని సంకల్పానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జె సంతోష్‌కుమార్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్‌లు అండగా నిలవగా, భారీ వర్షాల కారణంగా నేలకూలిన 70 ఏళ్ల చెట్టుకు జీవం పోశారు.

మర్రిచెట్టును తరలించి సిరిసిల్ల నూతన కలెక్టరేట్ లో ట్రాన్స్ లొకేట్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం నుంచి భారీ వృక్షాన్ని రవాణా చేసి సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో నాటారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి భారీ క్రేన్‌లను రవాణా కోసం రంగంలోకి దింపి మర్రిచెట్టును తరలించారు. రెండు 70 టన్నుల సామర్ధ్యం ఉన్న క్రేన్లను ఉపయోగించి మర్రిచెట్టును తరలించారు. సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక మర్రి చెట్టును ట్రాన్స్ లొకేట్ చేశారు. రాజన్న సిరిసిల్ల పీఆర్వో కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి సారథిగా పనిచేస్తున్న రమేశ్ అధికారికంగా విధులు నిర్వర్తిస్తూ రెండు నెలలుగా చెట్టుకు నీటిని సరఫరా చేశారు. ప్రకాష్ చేసిన కృషికి మంచి ఫలితాలు రావడంతో చెట్టు కొత్త ఆకులు రావడం ప్రారంభించింది.

చెట్టు తరలింపుకు ప్రత్యేక రోడ్డు ఏర్పాటు
కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం నుంచి కొత్త కలెక్టరేట్ కార్యాలయం వరకు 6 కి.మీ దూరంలో ఉన్న చెట్టు సులభంగా వెళ్లేందుకు ప్రత్యేక రహదారిని వేశారు.
కాగా తంగన్నపల్లి మండలం జిల్లెళ్ల అటవీ ప్రాంతంలో చెట్టు నుంచి రెండు పెద్ద కొమ్మలు నాటారు.
చెట్టు స్థలమార్పిడిపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు
. టీఆర్‌ఎస్ ఎంపీ జే సంతోష్ కుమార్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దానిని తరలించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ కూడా ప్రకాష్‌తో టచ్‌లో ఉండి చెట్టు తరలింపుకు కృషి చేశారు.












Click it and Unblock the Notifications