Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"డిజిటల్ అరెస్ట్" పేరుతో నయా మోసం.. 82 ఏళ్ల వృద్ధుడి నుంచి 72 లక్షలు స్వాహా !

డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో, అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి. హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు, రాన్సమ్‌వేర్ దాడులు సాధారణమైపోతున్న ఈ కాలంలో ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే కొత్త మోసం ప్రజలను వణికిస్తోంది. సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఇప్పటికే ఈ తరహా ఘటనలు పలు చోటు చేసుకోగా తెలంగాణలోని హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఓ 82 ఏళ్ల వృద్ధుడిని పది రోజుల పాటు మానసికంగా వేధించి.. ఏకంగా రూ.72 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

72-lakhs-embezzled-from-an-82-year-old-man-in-the-name-of-digital-arrest

అసలేం జరిగిందంటే..?

నారాయణగూడ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధుడికి ఆగస్టు 11న వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉండి.. తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మనీలాండరింగ్ కేసులో బాధితుడి ప్రమేయం ఉందని.. ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిచి నేరానికి పాల్పడినట్లు ఆరోపించాడు. దాంతో అతడిని 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నట్లు ప్రకటించారు.

పది రోజుల పాటు ఎవరి తోనూ మాట్లాడకూడదని.. ఇంటి నుంచి బయటకు రాకూడదని తీవ్రంగా హెచ్చరించారు. మరుసటి రోజు ఉదయం మరో వీడియో లింక్ ద్వారా సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. సదరు వృద్ధుడు నుంచి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా రూ.72 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా మరింత డబ్బు డిమాండ్ చేయడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

మరోవైపు కొద్దిరోజుల క్రితం 'డిజిటల్ అరెస్ట్' పేరుతో మహిళలను బురిడీ కొట్టించడమే కాకుండా.. ఇద్దరు మహిళలను ఏకంగా తొమ్మిది గంటల పాటు వీడియో కాల్‌లో ఉంచి నగ్నంగా కూర్చోబెట్టి బెదిరించాడు. ఈ దారుణ ఘటన బెంగుళూరు లోని మరతహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+