వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8వ నిజాం నవాబు ముకరంజా మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌కు చెందిన నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతిచెందారు. అతను ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు. హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసే వరకు పాలించాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు ముకరంజా కార్యాలయం వెల్లడించింది. అంత్యక్రియలు స్వస్థలంలో చేయాలన్న ఆయన కోరిక మేరకు ఈనెల 17వ తేదీన నిజాం భౌతిక కాయంతో హైదరాబాద్ రానున్నారు. మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లి, అవసరమైన ఆచార వ్యవహారాలను పూర్తి చేసిన తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ముకర్రం జా డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో, ఇంగ్లాండ్‌లోని హారో మరియు పీటర్‌హౌస్ , కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసించారు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో కూడా చదువుకున్నారు. మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి అత్యంత ఆప్తుల్లో ముకర్రంజా కూడా ఒకరు. వీరికి చెందిన రెండు ప్రధాన భవనాల్లో ఒకటైన ఫలక్ నుమా ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ లీజుకు తీసుకొని హోటల్ గా మార్పుచేశారు. చౌమహల్లా భవనంలో నిజాంల కాలంనాటి విషయాలు తెలుసుకునేందుకు వీలుగా మ్యూజియంగా రూపొందించారు.

8th Nizam Nawab Mukaranja death

7వ నిజాం మరో మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ , హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌ను కలుసుకుని, ప్రిన్స్ ముఖరంజా, అతని మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా జీపీఏ హోల్డర్ అయినట్లు ఆరోపిస్తూ మద్దతు పత్రాలతో పాటు ఫిర్యాదును సమర్పించారు. ప్రిన్స్ ముకర్రం జా, అతని కుమారుడు ప్రిన్స్ అజ్మెత్ జా, అతని సోదరుడు ప్రిన్స్ ముఫఖం జా UK హైకోర్టులో తప్పుడు పత్రాలను ఉపయోగించి అక్కడి నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న £35 మిలియన్ నిజాం ఫండ్‌పై దావా వేశారు. ముకరంజా కూడా 1980ల వరకు భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ఐదు వివాహాలు చేసుకోవడం, విడాకులవల్ల కొన్ని ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది.

English summary
Nizam Mukarram Ja Bahadur of Hyderabad died in Istanbul, Turkey
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X