బర్రెలక్కపై అనుచిత వ్యాఖ్యలు: రాంగోపాల్ వర్మపై కేసు, తమిరికొడాతమంటూ వార్నింగ్

తన సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఇటీవల తాను తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విషయంలో రాంగోపాల్ వర్మ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేగాక, తనను విమర్శించేవారికి తనదైన శైలిలో రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు ఆర్జీవీ. అయితే, ఈ సందర్భంలో రాంగోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు.

బర్రెలు కాస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించింది. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం నిర్వహించింది. అంతేగాక, ప్రజలు, యువత మద్దతు చూరగొన్నది. అయితే, ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంవంగా మారారు బర్రెలక్క.

A case filed on Ram Gopal Varma for derogatory comments on Barrelakka

ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ పలుమార్లు బర్రెలక్క గురించి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో బర్రెలక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. దీంతో బర్రెలక్క తరపున ఆమె లాయర్.. రాంగోపాల్ వర్మ మీద మహిళా కమిషన్‌లో కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ మాట్లాడిన మాటలు సరికాదని ఈ సందర్భంగా బర్రెలక్క తరపు న్యాయవాది అన్నారు.

'ఊరు పేరు లేని ఆవిడ (బర్రెలక్క) చాలా ఫేమస్ అయిపోయింది. బర్రె లెక్క కాస్త ఉంటుంది. బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించినట్లు సదరు లాయర్ వెల్లడించారు. ఇలాంటి మాటలు సరికాదన్నారు. 'రాంగోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ.. మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే.. ఇలా చేయడం తప్పు' అని న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయంపై మరింత పోరాటం చేస్తామన్నారు. ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. తెలంగాణ నుంచి తరిమికొడతాం అని ఆయన వర్మను హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+