సర్ ఫోన్ నాట్ అలౌడ్: పరీక్ష కేంద్రంలో సీపీని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్, రివార్డు!

హైదరాబాద్: ఇప్పటికే రెండు పదో పరీక్ష పేపర్ల లీకేజీ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక, ఎవరి సెల్‌ఫోన్లను అనుమతించడం లేదు. తాజాగా, పరీక్ష కేంద్రంలో తనిఖీ కోసం వచ్చిన ఓ పోలీస్ కమిషనర్‌ను అక్కడ భద్రతగా ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. అంతేగాక, పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆ సీపీ.. ఆమె విధుల పట్ల చూపిస్తున్న నిజాయితీని అభినందించారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీలు కలకలం రేపుతున్న క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు సీపీ చౌహాన్ కారు ఆగింది. అప్పటికే విధుల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు సీపీని చూడగానే దగ్గరకు వెళ్లి సెల్యూట్ చేశారు.

A constable stops Rachakonda CP

ఆ తర్వాత సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు లోపలికి వెళ్లబోయారు. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కల్పన అకస్మాత్తుగా సీపీని అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఆమె చేసిన పనికి అక్కడున్న పోలీసు అధికారులంతా షాకయ్యారు. ఏమైందోనని అందరూ ఆలోచిస్తున్న సమయంలో .. ఆ కానిస్టేబుల్.. 'సర్.. మీరు ఫోన్‌తో వెళ్తున్నారు.. పరీక్ష కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదు' అంటూ సీపీకి స్పష్టం చేసింది. దీంతో సీపీ ఒక్కసారి షాకయ్యారు. అనంతరం ఆమెకు తన మొబైల్ ఇచ్చి సీపీ లోపలికి వెళ్లారు.

A constable stops Rachakonda CP

పరీక్ష హాలును బయటకు వచ్చిన అనంతరం సీపీ చౌహాన్.. కానిస్టేబుల్ కల్పనను మెచ్చుకున్నారు. ధైర్యసాహసాలు, విధి నిర్వహణతీరును ప్రశంసించారు. ఆమెను అభినందిస్తూ.. తన జేబులో నుంచి రూ. 500 నోటు తీసి.. కల్పనకు బహుమతిగా అందించారు. అంతేగాక, ఆమెను రివార్డుకు ఎంపిక చేయాలంటూ అక్కడున్న పోలీసులకు సూచించారు. దీంతో సదరు కానిస్టేబుల్ కల్పన ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+