పెద్ద మనిషిగా భర్తకు బుద్ధి చెప్పమంటే.. ఆమెనే పెళ్లాడతానని వెంటపడ్డాడు!

నల్గొండ: తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని, కాస్త బుద్ధి చెప్పాలని ఓ పెద్ద మనిషిని కోరితే.. సదరు మహిళనే పెళ్లాడతానని బెదిరింపులకు దిగాడు ఆ ప్రబుద్ధుడు. అంతేగాక, భర్త, అతని బంధువులపై దాడి కూడా చేయించడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

నల్గొండ జిల్లా సూర్యాపేటలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదు నెలల క్రితం నుంచి ఆమెకు భర్త నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో ఆమె.. పెద్ద మనిషి కదా అనే ఉద్దేశంతో ఓ వార్డు కౌన్సిలర్‌ వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. భర్తకు కాస్త భయం చెప్పాలని అడిగింది. అయితే, ఆ కౌన్సిలర్‌ ఆమెపైనే కన్నేశాడు.

A councillor harassed a woman

ఆమె భర్తపై దాడి చేయించి బంధువులను బెదిరిస్తున్నాడని.. ఆ మహిళను తానే వివాహం చేసుకుంటానని చెబుతున్నాడని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

అంతేగాక, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరింపులకు దిగాడని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+