మద్యం మత్తులో తన ఇంటికి బదులో మరో ఇంటికి.! ఎస్ఐని చితకబాది, చెట్టు కట్టేశారు!!

హైదరాబాద్: బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి.. తప్పతాగాడు. అంతేగాక, తన ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్లాడు. దీంతో అతన్ని ఆ కుటుంబసభ్యులు, స్థానికులు పట్టుకుని చితకబాది చెట్టుకు కట్టేశారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, తాము కట్టేసి కొట్టిన వ్యక్తి ఎస్ఐ అని తెలుసుకుని స్థానికులు షాకయ్యారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజాపూర్ మండల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు శ్రీనివాస్. ఫూటుగా మద్యం సేవించి.. ఆ మైకంలోనే బుధవారం తెల్లవారుజామున వాహనంలో ఇంటికి బయలుదేరాడు. ఆయన అద్దెకు ఉండే ఇంటికి వెళ్లే దారిలో శుభకార్యం జరుగుతుండటంతో అక్కడ టెంట్ వేశారు.

A drunk SI went to another home instead of his house in Mahabubnagar district: locals attacked

వాహనం ఇంటి వరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెంట వచ్చిన డ్రైవర్ దాన్ని పక్క వీధిలో నిలిపివెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎస్సై తన ఇంటికి మరో దారి గుండా నడుచుకుంటూ వెళ్లారు. అయితే, మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్.. తన ఇల్లు అనుకొని మరో ఇంటి తలుపు తట్టారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. ఎవరో దుండగుడు అనుకుని ఇంటివారితోపాటు కాలనీవాసులు ఆయన్ని పట్టుకుని చితకబాదారు.

సాధారణ దుస్తుల్లో ఉండటంతో వచ్చింది ఎస్ఐని వారికి కూడా తెలియదు. అక్కడ్నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడ్ని చెట్టుకు కట్టేశారు. ఈ తతంగమంతా అయిన తర్వాత అతడు ఎస్ఐ అని స్థానికులు తెలిసింది. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించారు. ఇక ఈ గొడవ బయటికి రాకుండా అంతా జాగ్రత్త పడ్డారు. అయితే, కొన్ని ఫొటోలు, వీడియోలు అప్పటికే వైరల్ కావడంతో సదరు ఎస్ఐపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా? అని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+