ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టినరోజు జేజేలు: సీఎం కెసిఆర్‌కు గుడి కట్టిన అభిమాని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుపై ఉన్న అభిమానంతో తన ఇంటి ముందు గుడి నిర్మించాడు ఓ అభిమాని. ఆ గుడిలో కేసీఆర్‌ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి గుండ రవీందర్‌ బుధవారం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని దండేపల్లిలో విగ్రహావిష్కరణ చేశారు.

A fan built KCR's temple

కేసీఆర్‌ విగ్రహంతో పాటు తెలంగాణ అధికార పండగ బతుకమ్మ ప్రతిమను సిమెంటుతో తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఉద్యమం ప్రారంభం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన చరిత్రకు సంబంధించిన వివరాలతో కూడిన పాలరాతి శిలాఫలకం తయారు చేయించి గుడి పక్కనే ఏర్పాటుచేశారు. దీన్ని అతని తండ్రి ఆంజనేయులు ఆవిష్కరించారు.

సాయంత్రం రవీందర్ ఇంటి వద్ద ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కేక్ కట్ చేసి మాట్లాడారు. కేసీఆర్ అభిమానాన్ని చాటిన రవీందర్‌ను అభినందించారు. కాగా, రవీందర్ గతంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి విగ్రహాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.

English summary
A fan built TRS president and Telangana CM K Chandrasekhar Rao's temple in Adilabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X