ఆన్‌లైన్‌ వ్యభిచారం, బుక్కైన మేకప్‌మాన్‌.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైద‌రాబాద్‌: ఆన్‌లైన్‌ వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. వారినుంచి రూ. 1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ మధురానగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్న యువతి (28), సైనిక్‌పురి ఆర్కే పురానికి చెందిన మరో యువతి(28), యూసుఫ్‌గూడకు చెందిన మేకప్‌మెన్‌ కె.బండారి(23) ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. కొన్ని నెలలుగా 'లోకాంటో' వెబ్‌సైట్‌ ద్వారా వీరు ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

A Makeup Man and Two Junior Artists held for Online Prostitution

ఈ క్రమంలో శనివారం వీరు ముగ్గురూ కలిసి బోడుప్పల్‌ లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు కారులో వచ్చారు. అప్పటికే వీరి గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్ టీమ్ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌, ఎస్సై మహేష్‌, మోతీలాల్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు.

ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ. 1700 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని మేడిపల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A make-up man who belongs to Yusufguda and a junior artist who belongs to Madhuranagar and one more girl from RK Puram, Sainikpuri are arrested for doing an online prostitution through a website named locanto since long time. Malkajgiri sot police taken them into their custody and handover to Medipalli Police on Saturday.
Please Wait while comments are loading...