అమ్మా క్షమించు.!: భార్య వేధింపులు తాళలేక బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య, వీడియోలో కంటతడి

హైదరాబాద్: నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భార్య వేధింపులు తాళలేక ఓ వివాహితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు భార్యతోపాటు ఆమె తండ్రి, సోదరుడు, బాబాయ్ కారణమని ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియోలో వెల్లడించాడు. బతకాలని ఉంది కానీ.. అంటూ బాధితుడు ఆ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు.

మనస్పర్థలతో పుట్టింటికి భార్య

మనస్పర్థలతో పుట్టింటికి భార్య

గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్‌పేటకు చెందిన సంతోష్(37) ఎంబీఏ పూర్తి చేశాడు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, ఫలక్‌నుమాకు చెందిన యువతి కళ్యాణితో అతనికి 2013లో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు. అయితే, కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భార్య భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. ఆగస్టు నుంచి ఆమె కుమారుడితో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది.

భార్య వేధింపులతో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

భార్య వేధింపులతో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య

కాగా, శుక్రవారం సంతోష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఓ వీడియో చిత్రీకరించాడు. తన చావుకు భార్య, అత్తామామలు, బావమరిది, చిన్నమామ కారణమని ఆ వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ నలుగురికి శిక్షపడేలా చూడాలని అన్న అన్వేష్‌ను కోరాడు. అనంతరం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్న పురుగుల మందును కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగాడు.

అస్వస్థతకు గురై పడిపోవడంతో గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సంతోష్ మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సంతోష్ మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.

అమ్మా క్షమించు.. బతకాలని ఉందంటూ కన్నీరు

అమ్మా క్షమించు.. బతకాలని ఉందంటూ కన్నీరు

'అమ్మా నన్ను క్షమించు. నాకు బతకాలని ఉంది. ఎంతో జీవితాన్ని చూడాలనుకున్నా చావక తప్పట్లేదు. నా కొడుకుని ఉన్నత స్థితిలో ఉండేలా చదివిద్దామనుకున్నా. మంచి స్కూల్‌లో చర్పించా. కానీ, నా భార్య అవేం చేయనీయట్లేదు. ఎప్పుడూ ఏవో గొడవలు. పుట్టింటోళ్లతో కలిసి మూడు సార్లు హత్యకు యత్నించింది. నా భార్య కళ్యాణి తండ్రి, ఆమె సోదరుడు, బాబాయి నాపై హత్యకు యత్నించారు. ఆమె కోసం మిమ్మల్ని కాదనుకున్నా.. అక్కా క్షమించండి.

అన్వేష్.. అమ్మను బాగా చూసుకో. నా భార్యతోపాటు ఆమె తండ్రి, సోదరుడు, బాబాయికి శిక్ష పడేలా చూడండి. నాకు ఆస్తిలో ఎలాంటి వాటా వద్దు. అందరికీ గుడ్ బై' అంటూ తన ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియోలో సంతోష్ పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+