Hyderabad: ప్రేమించిన యువతికి పెళ్లి.. మండపానికి వెళ్లిన ప్రియుడు.. కట్ చేస్తే ఆస్పత్రికి మారిన సీన్..

ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ పెళ్లి చేసుకోవడమూ తప్పు కాదు. కానీ ఈ రెండు అక్షరాల ప్రేమ కోసం హత్యలు చేస్తారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇలా వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతారు. ఈ ప్రేమ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే చివిరికి కష్టలు తప్పవు. అది ప్రేమించిన వారికి కావొచ్చు..లేదా వారికి సంబంధించిన వారికి కావొచ్చు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని లంగర్‌హౌజ్‌లో జరిగింది.

A man commits suicide lover wedding hall at langar houz in hyderabad

తనను ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని తెలుసుకని కల్యాణ మండపానికి వచ్చాడు ప్రియుడు. ప్రియురాలిని కలవడానికి ప్రయత్నించాడు. కుదరకపోవడంతో చివరికి పెళ్లి మండపంలోనే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అంతటితో ఆగకుండా తన శరీరానికి మంటలంటుకోవడంతో అలాగే వెళ్లి వధువును పట్టుకున్నాడు. అక్కడే ఉన్న బంధువులు ఆమెను పక్కకు లాగారు. వధువుకు స్వల్ప గాయాలవ్వడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+