ఏ కష్టమొచ్చిందో: ఉరివేసుకుని యువ వైద్యురాలి ఆత్మహత్య
ఏ కష్టమొచ్చిందో గానీ ఓ యువ వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్: ఏ కష్టమొచ్చిందో గానీ ఓ యువ వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంకు చెందిన మూగి అనూష(25) నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఫిజియోథెరపి వైద్యురాలిగా పనిచేస్తోంది.
స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి అయిన అనూష తండ్రి మూగి ఎల్లాజీరావు ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. అప్పట్నుంచి తల్లి రాధావేణియే ఆమె ఆలనాపాలనా చూసుకుంటోంది. అనూష విజయనగరంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం ఉపాధిపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చింది. అమీర్‌పేటలో తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది.

కాగా, మూడు రోజుల క్రితం మాదాపూర్ హైటెక్ థియేటర్ సమీపంలో ఉన్న అతిథి హాస్టల్‌లో చేరింది. గురువారం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో సాయంత్రం 4.30 ప్రాంతంలో వసతి గృహం నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.
నాలుగు నెలల క్రితమమే నగరానికి వచ్చిన ఆ యువతి.. అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మరణంతో తల్లి రాణావేణి కన్నీరుమున్నీరుగా విలపించింది. అనూషకు శిరీష అనే సోదరి ఉంది. ఆమెకు వివాహమైంది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications