మూడు నెలల్లో తెలంగాణా రాజకీయాల్లో అద్భుతం జరుగుతుంది

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీల నుంచి కీలక నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ బస్సుయాత్ర చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. ఇక ఇటీవల వరంగల్లో బస్సుయాత్ర నిర్వహించిన కేసీఆర్ కడియం శ్రీహరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

మూడు నెలల్లో జరిగేదిదే .. కేసీఆర్ వ్యాఖ్యలు, కడియం కౌంటర్
మూడు నెలల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక వస్తుందని, ఎమ్మెల్యేగా రాజయ్య అవుతారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసం అంతా ఇంతా కాదని, ఇన్నేళ్లు బిఆర్ఎస్ లో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు.

A miracle will happen in Telangana politics in three months

మూడు నెలల్లో నిజంగానే అద్భుతం జరుగుతుంది : కడియం శ్రీహరి
అవును కచ్చితంగా మూడు నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరగనుందని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ముందు నుంచి కేసీఆర్ కు వరంగల్ అంటే వివక్ష ఉందని అందుకే కేసిఆర్ కుట్రలతో పిల్లలు ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. లోపల ఎన్నో కుట్రలు పెట్టుకుని బయటకు మాత్రం వేరేలా కనిపిస్తారని, ఆయన నిజస్వరూపం ఎవరికీ తెలియదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

అవినీతిలో కూరుకున్న కేసీఆర్ కుటుంబం
తెలంగాణ ప్రజలను మోసం చేసింది కెసిఆర్ అని, గత పదేళ్లలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీదకు, బినామీల పేర్ల మీదకి ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. అధికారులను లొంగదీసుకుని, భూ యజమానులను బెదిరించి వేల ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. కుటుంబం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, కెసిఆర్ కుటుంబం మొత్తం మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.

A miracle will happen in Telangana politics in three months

లోక్సభ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ కి మధ్యనే పోటీ
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుందని, ప్రస్తుతం లోక్సభ ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ కి మధ్యనే పోటీ ఉందని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలతో మూడు నెలల్లో అద్భుతం జరగబోతుంది అంటే.. మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే ప్లాన్ జరుగుతుందా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పక్క పార్టీల వంక దిక్కులు చూస్తున్నారు.

మూడు నెలలలో ఫిరాయింపులు
ఈ సమయంలో వచ్చే మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి భారీగానే ఫిరాయింపులు ఉంటాయని, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, అందుకే మూడు నెలలలో అద్భుతం జరగబోతుందని కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+