Pregnant Woman నది దాటాలంటే నరకయాతన.. పురిటి నొప్పులతో గర్భిణి అవస్థలు
వర్షకాలంలో ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ఉండే ప్రజల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా గర్భిణి సరైనా రవాణా లేక పురిటి నొప్పులతో నరకయాతన అనుభవించింది.

భారీ వర్షం
కుమురభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పద్మకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దిందా వాగు పొంగిపోర్లుతుంది. దీంతో వారు రోడ్డు దాటి వెళ్లేందుకు సాధ్యం కాలేదు. అయితే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆమెను ఎలాగో ఆటోలో వాగు సమీపంలోకి తీసుకువచ్చారు.

రెండు గంటలపాటు నిరీక్షణ
అక్కడ నుంచి వాగు వరకు సుమారు కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. వారు అతి కష్టం మీద నాటు పడవలో ప్రమాద స్థితిలో వాగు దాటారు. కానీ అంబులెన్స్ రాకపోవడంతో రెండు గంటలపాటు పురిటి నొప్పులతో ఆమె వాగు ఒడ్డున ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే చివరికి అంబులెన్స్ రావడంతో ఆమెను తరలించారు. కాగా శుక్రవారం ఆమె శిశువుకు జన్మనిచ్చారు.

వంతెన
వర్షం కురిసిన ప్రతీసారి వాగు దాటడం ఇబ్బంది అవుతుందని దిందా గ్రామవాసులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎత్తులో వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications