Student Heart attack: గుండెపోటుతో గురుకుల విద్యార్థిని మృతి..
ఈ మధ్య చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. చదువుకునే పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధల వరకు గుండెపోటు బారిన పడి చనిపోతున్నారు. గత ఏప్రిల్ లో మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందాడు.
ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలి చనిపోయాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్దీ ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లి డ్యాన్స్ చేస్తూ వేదికపైన కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు గుండెపోటుతో మరణించాడు.

తాజాగా వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని గురుకుల స్కూల్ లో ఓ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. పూడూరు మండలం బక్కారం గ్రామానికి చెందిన నందిని వికారాబాద్ లోని కొత్తగడిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం నందిని అస్వస్థతకు గురయింది. దీంతో హాస్టల్ సిబ్బంది వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. నందిని అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
నందిని గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. గుండెపోటు మరణాలు పెరగడంపై ఆందోళనలు వ్యక్తం అవుతోన్నాయి. కొద్ది రోజుల క్రితం 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మృతి చెందడం గమనార్హం.












Click it and Unblock the Notifications