భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో సూదిగాడి కలకలం: పలువురికి సూదిగుచ్చి దొరికిపోయాడు
హైదరాబాద్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూదిగాడు కలకలం సృష్టించాడు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సూది ఉన్మాది రవికుమార్ హల్ చల్ చేశాడు. పలువురు ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు.
దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు సూది ఉన్మాది రవికుమార్‌ను చితకబాది సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఉన్మాది నుంచి రెండు సిరంజిలు, రెండు సిమ్‌కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్మాది రవికుమార్ వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రైలు ఎక్కినట్లు ప్రయాణికులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలం పెంబి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం- బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఖనాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతూ మహిళ మృతి
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట రెండో వార్డుకు చెందిన బాలింత అనురాధ(32) స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ నెల 7న బిడ్డకు జన్మనిచ్చిన అనురాధకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. అక్కడ 3 రోజలు చికిత్స పొందిన అనంతరం కేర్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనురాధ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications