భద్రాచలంలో విషాదం: డ్రైనేజీ కాలువలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలాలో పడి ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి రామాలయం ఎదురుగా ఉన్న అన్నదానం సత్రం వద్ద మురుగు కాలువలో పడి హెడికానిస్టేబుల్ శ్రీదేవి మృతి చెందారు.
కాగా, భద్రాచలంలో మంత్రి కేటీఆర్ పర్యటనతో భద్రతారీత్యా అక్కడ ఎక్కువ మంది పోలీసులు మోహరించారు. దీంతో కొత్తగూడెంలో పని చేస్తున్న శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్.. డ్యూటీ నిమిత్తం భద్రాచలం వచ్చారు. డ్యూటీ అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధికి వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం భోజనం చేసేందుకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి. ఈ క్రమంలోనే అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న కాలువలో పడిపోయారు. ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా కాలువ నిండా నీళ్లు ఉండటంతో కాలువలో కొట్టుకుపోయారు.
కొద్ది దూరం తర్వాత గోదావరి కలకత్తా స్లోయిజ్ల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. భద్రాచలంలో గత రెండు రోజులుగా జరుగుతున్న గణపతి నిమజ్జనాలు, ఈరోజు జరగనున్న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భర్త రామారావు.. కొత్తగూడెం ఎస్బీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, భారీ వర్షం కారణంగా కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications