Free Bus: బస్సులో సీటు దొరకలేదని డ్రైవర్ సీట్ లో కూర్చున్న మహిళ.. !

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. దీంతో అక్యూపెన్సీ భారీగా పెరిగింది. అయితే కొంత మంది మహిళలు అవసరం ఉన్నా లేకున్నా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో సీట్లు దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కూడా ఎక్స్ ప్రెస్ బస్సులను తగ్గిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఉన్న ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగుల్లో జనాలు భారీగా ఎక్కుతున్నారు. ముఖ్యంగా మహిళలు భారీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ బస్ లో సీట్ దొరక్క డ్రైవర్ సీట్ లో కూర్చొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోవో ఓ మహిళ బస్ కోసం ఆర్టీసీ బస్టాండ్ లో
ఎదురు చూస్తోంది. చాలా సేపు ఎదురు చూసిన తర్వాత బస్ వచ్చింది. ఆమె బస్ ఎక్కేలోపు నిండిపోయింది. దీంత ఆమె బస్ దిగిపోయింది. మరో బస్ వచ్చే వరకు ఎదురు చూసింది.

A woman sat in the driver s seat of an RTC bus as she could not find a seat

మరో బస్ రాగానే బస్ ఎక్కింది. కానీ అప్పటికే సీట్లు నిండిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన మహిళ డ్రైవర్ సీటులో కూర్చొంది. బస్ టైమ్ కావడంతో డ్రైవర్ బస్ వద్దకు వచ్చాడు. డ్రైవర్ సీటు లో కూర్చొన్న మహిళను చూసి షాకయ్యాడు. తిగాలని కోరాడు. కానీ ఆ మహిళ తనకు సీటు చూపించాలని కోరింది. దీంతో డ్రైవర్ మహిళ సీటులోంచి దిగితేనే బస్ కదులుతుందని చెప్పాడు. దీంతో మిగతా ప్రయాణికులు ఆ మహిళకు సర్ది చెప్పారు. దీంతో ఆమె డ్రైవర్ సీటు నుంచి దిగిపోయింది.

డ్రైవర్ బస్ ఎక్కి ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఉచిత బస్ వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఉచిత బస్ కాకుండా మహిళలకు 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. దీని వల్ల అవసరం ఉన్నవారే బస్ ఎక్కుతారని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+