లవర్ కోసం మొగుడ్ని దుబాయ్‌లో వదిలేసి హైదరాబాద్‌కు యువతి: షాకిచ్చిన ప్రియుడు!

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది యువతి. దీంతో వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే, ఆ యువతి కుటుంబసభ్యులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేశారు.

హైదరాబాద్: సోషల్ మీడియా అనేది నేటి యువతీ యువకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అది మంచైనా చెడైనా అదే స్థాయిలో ఉంటోంది. కొందరు తమ జీవితాలకు ఉపయోగపడేలా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. మరికొందరి జీవితాలను ఆగమ్య గోచరంగా మారుస్తున్నాయి ఈ సోషల్ మీడియా వేదికలు. తాజాగా, ఓ యువతి జీవితం ఇలాగే మారింది.

భర్తను వదిలేసి వస్తే ప్రియుడు షాకిచ్చాడు

భర్తను వదిలేసి వస్తే ప్రియుడు షాకిచ్చాడు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది యువతి. దీంతో వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే, ఆ యువతి కుటుంబసభ్యులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేశారు. అనంతరం భర్తతో కలిసి ఆమె దుబాయి వెళ్లింది. కానీ, మాజీ ప్రియుడు మళ్లీ ఆమెతో సంప్రదింపులు జరపడంతో భర్తను వదిలేసి వచ్చింది యువతి. కానీ, ఆమెకు ప్రియుడు భారీ షాకిచ్చాడు.

ఇన్‌స్టాలో పరిచయం ప్రేమగా.. సహజీవనం

ఇన్‌స్టాలో పరిచయం ప్రేమగా.. సహజీవనం

ఆ వివరాల్లోకి వెళితే.. బోరబండ రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి(27) టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం ఆమెకు మహారాష్ట్ర జల్‌గావ్‌కు చెందిన సైఫ్(28)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్ నగరానికి వచ్చిన సైఫ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతితో సహజీవనం చేశాడు.

ప్రియుడి మాటలు నమ్మి.. భర్తను దుబాయ్‌లో వదిలేసి..

ప్రియుడి మాటలు నమ్మి.. భర్తను దుబాయ్‌లో వదిలేసి..

అయితే, 2020లో ఆ యువతికి ఆమె కుటుంబసభ్యులు వేరొక సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయి వెళ్లిపోయింది. కొంత కాలం తర్వాత, భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్ మళ్లీ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. దీంతో ఆ యువతి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు గర్బస్రావం కూడా చేయించాడు. కొంత కలిసి ఉండి ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.

భర్తను వదిలేసి వస్తే.. షాకిచ్చిన ప్రియుడు

భర్తను వదిలేసి వస్తే.. షాకిచ్చిన ప్రియుడు

అంతేగాక, ఈ ఫిబ్రవరి 22న వేరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు సైఫ్ సిద్దమయ్యాడు. విషయం తెలిసిన బాధిత యువతి సైఫ్ గ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్ తోపాటు అతని కుటుంబసభ్యులు ఆమెను అంగీకరించకపోవడంతో ఆమె తిరిగి నగరానికి వచ్చి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+