హైదరాబాద్‌లో పెట్రోల్ లేదు మరి.. గుర్రంపై ఫుడ్ డెలివరీ
Petrol and Diesel shortage: ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొన్ని గంటలే అయినప్పటికీ.. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అనేక చోట్ల నో పెట్రోల్ బోర్డులూ వెలిశాయి.
హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు భారీఎత్తున జరిమానాలు, జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీనిపై కేంద్రం యుద్ధప్రాతిపదికన స్పందించింది. యూనియన్లను చర్చలకు ఆహ్వానించింది. దీనితో డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను ఉపసంహరించుకున్నారు.

పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తుందంటూ వార్తలు రావడం.. హైదరాబాద్‌లో కలకలం రేపింది. వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. ఫలితంగా- తీవ్ర రద్దీ నెలకొంది. పలు చోట్ల ఇంధన కొరత సైతం తలెత్తింది. నో స్టాక్ బోర్డులనూ ఏర్పాటు చేసేంత వరకూ వెళ్లింది దీని తీవ్రత.
ఈ పరిస్థితుల వల్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. సకాలంలో వారు ఫుడ్ డెలివరీ చేయలేకపోయారనే ఫిర్యాదులు ఉన్నాయి. బండి నడవడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం, వారంతా పెట్రోల్ బంకుల వద్ద చిక్కుకుపోవడం దీనికి కారణమైంది.
#Hyderabadi Bolde Kuch bhi Kardete 😅
— Arbaaz The Great (@ArbaazTheGreat1) January 2, 2024
Due To Closure of #PetrolPumps in Hyderabad, A Zomato Delivery boy came out to deliver food on horse at #Chanchalgudaa near to imperial hotel.#Hyderabad #ZomatoMan #DeliversOnHorse#TruckDriversProtest pic.twitter.com/UUABgUPYc1
ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో జొమాటో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఉద్యోగి ఒకరు- గుర్రంపై సవారీ చేయడం కనిపించింది. హైదరాబాద్ చంచల్‌గూడ వద్ద గుర్రంపై ఫుడ్ డెలివరీకి వెళ్తూ కనిపించాడా జొమాటో బాయ్. పెట్రోల్ లేకపోవడం వల్ల బండిని బయటికి తీయలేకపోయానని, సకాలంలో ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రాన్ని రోడ్డు మీదికి తేవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications