చంచల్ గూడ జైలుకు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు..!!

రాజకీయ సంచలనానికి కారణమైన ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన సమయం నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసులు అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా, రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. కేసుల్లో అనుసరించాల్సిన విధివిధానాలు అమలు చేయలేదని ఏసీబీ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

ఆ తరువాత సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఇదే అంశాన్ని సంబంధించి భిన్న తీర్పులు వచ్చాయి. నిందితులు వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో, పోలీసులు.. షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ACB Court 14 days Remanded for Three Accused in mla poaching case

అనంతరం వారిని కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్​ను న్యాయమూర్తి తిరస్కరించారు.

14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో, ఆ ముగ్గురిని చంచల్ గూడ జైలుకు భద్రతా ఏర్పాట్లతో తరలించారు. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరితే వంద కోట్ల రూపాయాలు ఇస్తామంటూ తమను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇక, ఇదే ఎపిసోడ్ కు సంబంధించి అసలు సినిమా ముందుందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేడు మునుగోడులో ఉప ఎన్నిక బహిరంగ సభలో కేసీఆర్ ఈ అంశానికి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+