సినీనటుడు నానికి తృటిలో తప్పిన ప్రమాదం, కారు ప్రమాదంలో స్వల్పగాయాలతో సేఫ్
సినీ హీరో నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: సినీ హీరో నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో నాని కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో హీరో నానికి, ఆయన డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అయితే నాని పెదవికి స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. నాని షూటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే నాని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరో కారును తెప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. అయితే అతడు మద్యం సేవించి లేడని ఆ పరీక్షలో తేలింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని కారు డ్రైవర్ శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు.
ప్రమాదంపై హీరో నాని స్పందన...
మరోవైపు తన కారు ప్రమాదంపై హీరో నాని స్పందించారు. తను క్షేమంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అభిమానులు ఆందోళన చెందొద్దని ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలయ్యాయని, కంగారు పడొద్దని సూచించారు. వారంలో కోలుకొని యథావిథిగా షూటింగ్‌లో పాల్గొంటానన్నారు.
I’m okay :)
— Nani (@NameisNani) January 26, 2018
Just a few bruises here and there ..
Small break from the Yudham ..
Will be back in action in a week!












Click it and Unblock the Notifications