పరిశ్రమలో అమ్మాయిలతో, నాతో అలా: భార్య, అది తప్పే కానీ: నటుడు సామ్రాట్ ఏమన్నారంటే
Recommended Video

హైదరాబాద్: తనపై భార్య హర్షిత, అత్తామామలు చేసిన ఆరోపణలపై నటుడు సామ్రాట్ రెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. వారంతా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. హర్షిత, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం అన్నారు.
తాను డ్రగ్స్ తీసుకుంటానని చెబుతున్నారని, కానీ తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. తనకు డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లు ఉంటే ఇప్పటి వరకు పోలీసులకు ఎందుకు పట్టుబడలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ వాడకంపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉందన్నారు. హర్షిత కుటుంబ సభ్యులు తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

దొంగిలించలేదు, కానీ అది నా తప్పే
తాను ఇంట్లో నుంచి నగలు దొంగిలించానని హర్షిత చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ ఇంట్లో తనకు కావాల్సిన వస్తువులను తాను తీసుకున్నానని సామ్రాట్ రెడ్డి చెప్పారు. అయితే కోపంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం మాత్రం తన తప్పే అన్నారు.

పబ్బుల్లో హుక్కా తాగించేవాడు
అంతకుముందు, సామ్రాట్ రెడ్డి భార్య హర్షిత కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సామ్రాట్ ఇంట్లో విలన్‌లా ప్రవర్తించేవాడని వాపోయారు. తనకు ఇష్టం లేకున్నా పబ్బులకు తీసుకు వెళ్లేవాడని చెప్పారు. తనకు పబ్బుల్లో హుక్కా తాగించేవాడని చెప్పారు. వరకట్నం కోసం వేధించేవాడని, అందుకే కొన్నాళ్ల క్రితం వేధింపుల కేసు పెట్టానని చెప్పారు.

కోట్ల రూపాయల కట్నం, ఆస్తి బదిలీ కోసం వేధింపు, కొట్టేవాడు
అతను అరెస్టయి, ఆ తర్వాత బయటకు వచ్చాక వేధించేవాడని హర్షిత ఆరోపించారు. సామ్రాట్ తన కళ్ల ముందే అమ్మాయిలతో తిరిగేవాడని చెప్పారు. సినిమాల్లో నటించనని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. కానీ మాట తప్పాడన్నారు. ఆస్తి బదలీ చేయమని తనను కొట్టేవాడని చెప్పారు. తన పేరెంట్స్ పెళ్లి సమయంలో కోట్ల రూపాయల కట్నం ఇచ్చారన్నారు. ఆస్తి బదలీ చేయకపోవడంతో కొట్టేవాడని చెప్పారు.

పరిశ్రమలో అమ్మాయిలతో, వదిలించుకోవాలని
సామ్రాట్ రెడ్డికి లేని అలవాటు లేదని హర్షిత అన్నారు. సినిమా పరిశ్రమలో చాలామంది అమ్మాయిలతో సామ్రాట్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎంత నచ్చ చెప్పినా వినలేదన్నారు. తనను వదిలించుకోవాలని చూడటమే కాకుండా చాలాసార్లు తనపై దాడి చేశారన్నారు. తనతో కలిసి ఉండే ఉద్దేశ్యం లేదన్నారు. పెద్దలతో రాజీ ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. కోర్టులోనే అన్ని విషయాలు తేలుతాయన్నారు.












Click it and Unblock the Notifications