రేవంత్ రెడ్డి దగ్గరకు నటి హేమ పంచాయితీ

నటి హేమకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇదే సమయంలో పలు వివాదాలతో వార్తల్లో కూడా నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ పార్టీలో ఉన్నది తాను కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు.

అయితే హేమ రేవ్ పార్టీలోనే ఉన్నారని పోలీసులు నిర్ధారించుకోవడంతో ఆమెకు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు రేవ్ పార్టీకి అటెండ్ అయిన వారు ఇచ్చిన బ్లడ్ శ్యాంపిల్స్‌లో అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ కేసులో హేమ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. రేవ్ పార్టీలో దొరికిపోవడంతో హేమను మా మూవీ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి.

actress Hema special request to cm revanth reddy

ఆమెపై నేరు రుజువు అయినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు సైతం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. అన్నట్టుగానే హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. కొన్నాళ్లు సెలైంట్ ఉన్న హేమ, తిరిగి మీడియాలో తెగ హంగామా చేస్తోంది. తన సోషల్ మీడియాలో వరుస వీడియోలు పెట్టి బీభత్సం సృష్టిస్తోంది.డ్రగ్స్ కేసులో నా పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి మీడియాలో నన్ను ఒక టెరరిస్ట్‌లాగా, జీహాద్‌కు వర్క్ చేసి దానిలా చూపిస్తున్నారంటూ వాపోయింది.

నన్ను ఇంత దారుణంగా విమర్శిస్తే నేను ప్రముఖుల దగ్గరకు ఎలా వెళ్లాలి. వాళ్లని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియడం లేదు అందుకే ఈ వీడియో పెడుతున్నానంటూ చెప్పుకొచ్చింది.నన్ను మీడియా వాళ్లు బ్లాక్ మెయిల్ చేశారు. కొంతమంది సెటిల్‌మెంట్‌కి రమ్మని అడిగారు. పెద్దవాళ్లు కాంప్రమైజ్ చేస్తానని అన్నారు. నాకు మీడియా వాళ్లకి ఎలాంటి గొడవలు లేవు. నేనెందుకు రావాలి నేను తప్పు చేయలేదు. బ్లాక్ చేసిన వాళ్ల నెంబర్లు కూడా ఉన్నాయి. తొందరలో అప్డేట్ చేస్తాను. నా వాయిస్‌ను రేవంత్ రెడ్డి వరకు తీసెకెళ్లండి ప్లీజ్. ఆ బాధ్యత నాకు సపోర్ట్ చేసే అన్నాదమ్ములు మీ మీదనే ఆధారపడి ఉంది. ప్లీజ్ నన్ను తీసుకెళ్లండంటూ చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+