నా భర్త, ఐఏఎస్ రేఖారాణి నుంచి ప్రాణహానీ: నటి పూజిత
హైదరాబాద్: తన భర్త విజయగోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి తనకు ప్రాణహానీ ఉందని సినీ నటి పూజిత మరోసారి ఆరోపించారు. ఆమె మంగళవారం నాడు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
విడాకులు ఇవ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూజిత తన ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను పోలీసులకు సమర్పించారని తెలుస్తోంది. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరారు.
నటి పూజిత తన భర్త విజయ గోపాల్ పైన ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండానే రేఖారాణిని పెళ్లాడారని ఆమె వారం రోజుల క్రితం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

కాగా, తాను పూజితను అసలు పెళ్లే చేసుకోలేదని విజయ్ గోపాల్ చెప్పారు. ఆమెతో సుమారు పన్నెండేళ్లపాటు సహజీవనం చేశానని, గత ఏడేళ్ల నుంచి పూజితకు దూరంగా ఉంటున్నానని, తమ ఇరువురికి ఒక కొడుకు ఉన్నాడని చెప్పారు.
తనపై ఆరోపణలకు దిగిన పూజిత ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పూజిత తన నుంచి ఏం కోరుకుంటుందో తెలియట్లేదన్నారు. పూజిత వెనక ఎవరో ఉన్నారని, వారి మాటలు వినే పూజిత తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. రేఖారాణి కూడా తాను అన్నీ చూసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నానని, పూజిత - విజయ గోపాల్ పెళ్లి చేసుకోలేదని, దానిని తాను నిర్ధారించుకున్నానని వివరణ ఇచ్చారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications