కేటీఆర్ పై రేవంత్ కీలక నిర్ణయం - కీలక మలుపు..!!

తెలంగాణ రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన రేవంత్ గురి పెట్టారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా రేసు కు చేసిన చెల్లింపుల పైన విచారణకు రంగం సిద్దమైంది. దీంతో, కేటీఆర్ సైతం తాను అరెస్ట్ కు సిద్దమంటూ ప్రకటించారు. రేపు (శనివారం) రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

బిగ్ టర్న్
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఈ రేసింగ్ కోసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ. 55 కోట్లను అప్పటి మంత్రి కేటీఆర్ ఓ విదేశీ సంస్థలకు బదిలీ చేయించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇందులో కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. అదే సమయంలో సీఎం రేవంత్ నేరుగా గవర్నర్ తో సమావేశమై ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలను వివరంచినట్లు సమాచారం. ఇక, ఈ వార్త బయటకు రావటంతో పొలిటికల్ గా టెన్షన్ మొదలైంది. ఇదే అంశం పైన ఇప్పటికే కేటీఆర్ సైతం స్పందించారు.

After ACB seeks Governor s nod to probe KTR over Formula E payment state political taking big turn

సిద్దమంటూ కేటీఆర్
తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆ మొత్తాన్ని చెల్లించానని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. రేవంత్ ప్రభుత్వం తన పైన కక్ష్య సాధింపులో భాగంగా అరెస్ట్ చేసి రెండు లేదా మూడు నెలలు జైలలో ఉంచాలని అనుకుంటే తాను సిద్దమని స్పష్టం చేసారు. జైలలో యోగా చేసి బయటకు వచ్చి పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. తాజాగా కేటీఆర్ వరుస ట్వీట్లు చేసారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. విచారణ సంస్థలకు స్వాగతం పలుకుతానని వ్యాఖ్యానించారు. రేవంత్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇక, కేటీఆర్ పైన వ్యూహాత్మకంగానే రేవంత్ అడుగులు వేస్తున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.

కీలక పరిణామాలు
రేపు (శనివారం) రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు ఉంటాయని నేతలు అంచనా వేస్తున్నారు. నాడు కేటీఆర్ ఆర్దిక శాఖ అనుమతి లేకుండా రూ 55 కోట్లను కేటీఆర్ ఒక విదేశీ సంస్థకు బదిలీ చేయించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇదే అంశంలో అప్పటి పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా కేటీఆర్ సైతం ఇందులో అర్వింద్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని..అదే జరిగిందని చెప్పారు. కేటీఆర్ తాను అరెస్ట్ కు సిద్దమని చెబుతున్న ఈ సమయంలో.. సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+