ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ తర్వాత.. కెసిఆర్ 'ఆపరేషన్ వరంగల్': టిఆర్‌ఎస్‌లోకి సారయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/వరంగల్: హైదరాబాదులో ఆపరేషన్ ఆకర్ష్ అనంతరం... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజాగా ఆపరేషన్ వరంగల్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత బస్వరాజు సారయ్య కారు ఎక్కనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఆయన తెరాసలో చేరనున్నారని తెలుస్తోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ... పొన్నాల లక్ష్మయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, బస్వరాజు సారయ్య కేంద్రాలుగా ఉండేది. అంతకుముందు కొండా దంపతుల హవా కూడా కనిపించేది.

Also Read: వైసిపి ఎమ్మెల్యేలపై పత్తిపాటి సంచలనం, కడపలో లోకేష్ ఆపరేషన్

వారు వైసిపిలోకి, ఆ తర్వాత తెరాసలోకి వెళ్లాక.. బస్వరాజు, గండ్ర, పొన్నాలల హవా కాంగ్రెస్ పార్టీలో కనిపించింది. ఇప్పుడు బస్వరాజు సారయ్య కారు ఎక్కడం కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లాలో పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

After Hyderabad, KCR starts 'Operation Warangal'

హైదరాబాద్ తర్వాత వరంగల్‌పై కన్నేసిన సీఎం

తెలంగాణ సీఎం కెసిఆర్ గ్రేటర్ ఎన్నికల ముందు వరకు హైదరాబాదు పైన ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. అందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలోకి లాక్కున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు, తర్వాత హైదరాబాదులో పెద్ద ఎత్తున టిడిపి నేతలను తెరాసలో చేర్చుకున్నారు.

కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి.. తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టిడిపి ఇప్పుడు అయిదుకు పడిపోయింది. గ్రేటర్ ఎన్నికల అనంతరం ఇప్పుడు వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ దృష్టి అటు పడింది.

ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావును టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. కొండా సురేఖ కూడా తెరాసలో ఉన్నారు. తాజాగా బస్వరాజు సారయ్య కారు ఎక్కనున్నారు. ఇలా బలమైన నేతలతో కెసిఆర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోను పలువురు విపక్ష నేతలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తెరాసతో టచ్‌లో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి డికె అరుణ, ఆమె సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల పేర్లు పాలమూరు జిల్లా నుంచి వినిపిస్తున్నాయి.

English summary
After Hyderabad, Telangana CM KCR starts 'Operation Warangal'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X