హైదరాబాద్‌లో మరో మారుతీరావు, కూతురు-అల్లుడిపై కత్తితో దాడి, ఆమె పరిస్థితి అత్యంత విషమం
హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరిచిపోకముందే హైదరాబాదులో బుధవారం అలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి... కూతురు, ఆమె ప్రియుడి పైన దాడి చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది.
అమ్మాయి తండ్రి ప్రేమ జంట పైన కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేశాడు. ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ, ఇష్టం లేని పెళ్లి వ్యవహారమే కారణం. యువతి పరిస్థితి విషమంగా ఉంది. మిర్యాలగూడ ఘటన మరవకముందే మరో సంచలనం చోటు చేసుకోవడం కలకలం రేపింది.

సందీప్, మాధవిలపై దాడి, యువతి పరిస్థితి విషమం
దాడికి గురైన వారు సందీప్, మాధవిలుగా గుర్తించారు.దాడి చేసిన వ్యక్తిని మనోహరాచారిగా గుర్తించారు. అతను కొద్ది గంటల తర్వాత పోలీస్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వారిపై దాడి జరగగానే దగ్గరలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి నీలిమ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స జరుగుతోంది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది.. యువతి తండ్రి చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. యువతీ యువకులపై దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
బైక్ పైన వచ్చి కత్తితో దాడి
నిందితుడు బైక్ పైన వచ్చి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ సంఘటన నడి రోడ్డు పైన, పట్టపగలు జరిగింది. అతనిని పట్టుకునేందుకు పలువురు ప్రయత్నించగా, తప్పించుకొని పరారయ్యాడు. మెడ మీద, చెయ్యి మీద తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేశారు.

పట్టుకునే ప్రయత్నం చేసినా విఫలం, ఓ వ్యక్తి ధైర్యం చేసి తన్నాడు
అమ్మాయి, అబ్బాయి నడుచుకుంటూ వస్తుండగా బైక్ పైన వచ్చిన నిందితుడు ఆ పక్కన తన వాహనాన్ని ఆపేసి, అక్కడి నుంచి కత్తి బయటకు తీసి పక్కనే ఉన్న యువతిపై, యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. యువతికి రక్తం చాలా పోయింది. నిందితుడిని పట్టుకునేందుకు పలువురు ప్రయత్నం చేసినా దొరకలేదు. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి నిందితుడిని ఓ తన్ను తన్నాడు. అతను మరింత గట్టిగా తన్నితే కిందపడేవాడు. కానీ నిందితుడు కత్తితో బెదిరిస్తుండటంతో అందరూ ముందుకు వెళ్లేందుకు జంకారు.

సోదరుడు ఏం చెప్పారంటే
గాయపడ్డ నవదీప్ సోదరుడు మాట్లాడుతూ.. వీరిద్దరు ప్రేమించుకున్నారని, ఇద్దరూ మేజర్లేనని చెప్పారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి అమ్మాయి తండ్రికి ఇష్టం లేదని చెప్పారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నారని తెలిపారు. తన సోదరుడు, అమ్మాయి ఇప్పటికే పెళ్లి చేసుకున్నారని చెప్పారు. సందీప్, మాధవిలు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. అమ్మాయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని చెప్పారు.

అయిదేళ్లుగా ప్రేమించుకొని, పెళ్లి
సందీప్, మాధవిలు గత అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇది అమ్మాయి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. మేనమామను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అమ్మాయి మాత్రం మరొకరిని ఇష్టపడి అతనిని పెళ్లి చేసుకుంది. ఈ దాడిలో అమ్మాయి తలకు బాగా గాయమైంది. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఇది కూడా కులాంతర వివాహమే. ఈ వివాహం ఇష్టం లేక అతను కూతురు, అల్లుడిని దారుణంగా నరికేశాడు.

పదో తరగతి నుంచి ప్రేమించికుంటున్నారు, ఇటీవలే పెళ్లి
సందీప్, మాధవిలు పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు వారు డిగ్రీ చదువుతున్నారని తెలిపారు. దాదాపు వారం క్రితమే పెళ్లయిందని చెప్పారు. గుడిలో పెళ్లి చేసుకున్నారని చెప్పారు. అమ్మాయి వయస్సు 20, అబ్బాయి వయస్సు 21గా ఉంది. మాధవి బోరబండలో ఉంటోందన్నారు. సందీప్ ప్రేమ్ నగర్లో ఉంటున్నారని చెప్పారు. వీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి తండ్రి ప్రతి రోజు వారితో బాగానే మాట్లాడాడని చెప్పారు. ప్రతి రోజు వచ్చి మాట్లాడాడని అన్నారు. కానీ ఈ రోజు హఠాత్తుగా సందీప్‌కు ఫోన్ చేసి, రమ్మని పిలిచాడు. దీంతో సందీప్, మాధవిలు కలిసి ఆమె తండ్రి వద్దకు వెళ్లారు. అప్పుడు హత్య జరిగింది. మూడు రోజుల క్రితమే అమ్మాయి బంధువులు అందరూ వచ్చారని చెప్పారు. తమ వద్దకు రావాలని ఫోర్స్ చేశారని చెప్పారన్నారు. వారం రోజులుగా కౌన్సెలింగ్ చేస్తున్నారని చెప్పారు.
మాధవి పరిస్థితిపై డాక్టర్లు
మాధవి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. రెండు మూడు రోజులైతే గానీ పరిస్థితి చెప్పలేమన్నారు. రోడ్డు మీద ఘటన జరగడంతో ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారు. మాధవి మెడ నరాలు చాలా వరకు దెబ్బతిన్నాయని చెప్పారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications