హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యథాతథంగా ట్వీట్లు: రామ్ గోపాల్ వర్మ, రాధాకృష్ణలకు లీగల్ నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యాయవాద వృత్తిని కించపరుస్తూ ట్వీట్లు చేశారని, దానిని ఆంధ్రజ్యోతి యథాతథంగా ప్రచురించిందని, విలువలు పాటించలేదని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది కోటేశ్వర రావు, జనసేన పార్టీ న్యాయ విభాగం లీగల్ నోటీసులను పంపించింది.

లాయర్లను కించపరిచేలా రామ్ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్లను యథాతథంగా ప్రచురించారని, తన పరువుకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఇందుకుగాను ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమకు రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు నోటీసులు పంపించారు.

కాగా, పవన్ కళ్యాణ్‌, రామ్ గోపాల్ వర్మలపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. పవన్‌ అభిమానులు టీవీ 9 ఛానల్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆ ఛానల్‌ సీఈవో రవిప్రకాశ్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడటం, జనసేనాని తన ట్విట్టర అకౌంట్ ద్వారా టీవీ-9లో ప్రసారమయ్యాయని చెబుతూ కొన్ని కథనాలను వక్రీకరించి అప్ లోడ్ చేశారని, ఇవి తమ విశ్వసనీయతను దెబ్బతీశాయని ఆరు రోజుల క్రితం టీయూడబ్ల్యూజే ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఆధారాలు అందించారు.

టీడీపీ మీడియాకు లీగల్ నోటీసులిస్తా, టైం ఇస్తా: పవన్, 'అప్పుడు నా వైపు ఎవరూ లేరంటూ' సూక్తి!టీడీపీ మీడియాకు లీగల్ నోటీసులిస్తా, టైం ఇస్తా: పవన్, 'అప్పుడు నా వైపు ఎవరూ లేరంటూ' సూక్తి!

After Pawan Kalyan, Case against Ram Gopal Varma

రవిప్రకాశ్‌తోపాటు ఇతర ఉద్యోగులను దూషించిన ఆడియోలను సైతం పోలీసులకు సమర్పించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం పవన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రామ్ గోపాల్ వర్మపై శ్రీకాకుళంలోను ఫిర్యాదు అందింది. ఓ టీవీ ఛానల్‌ చర్చా వేదికలో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని ఓ మహిళా నేత రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు ఈ కేసును గురువారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పరిశీలించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. బాధితురాలు గతంలోనూ విశాఖపట్నంలో వర్మపై కేసు పెట్టగా ఆ కేసును కూడా బంజారాహిల్స్‌ బదిలీ చేశారు.

English summary
After Jana Sena chief Pawan Kalyan, Case against director Ram Gopal Varma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X