వీసా కావాలంటే కోరిక తీర్చాల్సిందే: మహిళపై రేప్ యత్నం, అరెస్ట్

వీసా కావాలంటే తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సాయం కోరి వచ్చిన మహిళపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అతని బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైద‌రాబాద్‌: వీసా కావాలంటే తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సాయం కోరి వచ్చిన మహిళపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అతని బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ వివాహిత త‌న భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకొనేందుకు గ‌ల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే క్ర‌మంలో పాస్ పోర్టు సంపాదించుకున్న‌ ఆమె.. వీసా కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

Agent held for 'molesting' woman

కాగా, వీసా కావాలంటే హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన కరీముద్దీన్ అనే ఏజెంట్ ను కలవాలని తెలిసిన వారు ఆమెకు చెప్పారు. దీంతో 25 రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన ఆ మ‌హిళ కరీముద్దీన్ వద్దకు వెళ్లి వీసా కోసం అభ్యర్థించింది. కానీ, అతడు వీసా ఇవ్వకుండా తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు చార్మినార్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో నిందితుడు క‌రీముద్దీన్‌ను అరెస్టు చేసిన‌ట్టు డీసీపీ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లే వారిని మోసం చేస్తూ మ‌హిళ‌ల‌ప‌ట్ల వేధింపుల‌కు గురిచేస్తున్న వారిని ప‌ట్టుకొనేందుకు రెండు బృందాలు ప‌నిచేస్తున్నాయ‌ని డీసీపీ తెలిపారు. మోసాలు, వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+