రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికల కమిటీ ప్రకటించిన ఏఐసీసీ; సమరానికి కాంగ్రెస్ రెడీ!!

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీని ఏఐసిసి ప్రకటించిన విషయం తెలిసిందే. మధు యాష్కీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించగా, ప్రచార కమిటీ కో చైర్మన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ప్రచార కమిటీ కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను నియమించింది.

మొత్తం 37 మందితో ప్రచార కమిటీని ఏఐసిసి ఏర్పాటు చేసింది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఏఐసిసి ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి చైర్మన్ గా రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. మొత్తం 26 మందితో కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ అందులో సీనియర్ నాయకులకు అవకాశం కల్పించింది.

AICC announced election committee; Revanth Reddy as Chairman; Congress is ready to fight!!

ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఎన్నికలకమిటీ సభ్యులుగా భట్టివిక్రమార్క, జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, వి హనుమంతరావు, మహమ్మద్ అజారుద్దీన్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ లకు స్థానం కల్పించింది.

అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి గౌడ్, చల్ల వంశీచందర్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, పోరిక బలరాం నాయక్, పొదెం వీరయ్య, సీతక్క, మహమ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ సాగర్ రావు, ఎన్ సునీత రావులకు ఎన్నికల కమిటీలో స్థానం కల్పించింది.

ఎన్నికల కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా కమిటీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్స్ కు అవకాశం కల్పించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పని చేసుకుంటూ పోతోంది.

వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఐక్యత రాగాన్ని ఆలపిస్తూ తెలంగాణలో ముందుకు సాగుతుండడం కాంగ్రెస్ పార్టీపై అందరి దృష్టి పడేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+