తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్ది ఖరారు..!!
కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు సీనియర్ నేతను ఎంపిక చేయాలని నిర్ణయించింది. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. తెలంగాణ నుంచి కేకే స్థానంలో కొత్త అభ్యర్ది రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.
రాజ్యసభ బరిలో
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒక స్థానం కోసం ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ కానుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంటుంది. కాగా, ఈ 12 స్థానాల్లో తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానం కూడా ఉంది. కేశవరావు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరడంతో జూలై 5న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎన్నికయ్యే నేత 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగుతారు.

కాంగ్రెస్ నిర్ణయం
కేకే స్థానంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది, అభిషేక్ మనుసింఘ్వీకి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలకు ఇవి రెండోసారి ఎన్నికలు. ఇంతకుమందు రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రె్‌సకు దక్కగా.. రెండింటినీ తెలంగాణకు చెందిన నేతలకే ఇచ్చారు. వీరిలో ఒకరు సీనియర్ నాయకులు రేణుకాచౌదరి కాగా, మరొకరు యువనేత ఎం.అనిల్‌కుమార్ యాదవ్. అప్పట్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ రెం డు పదవులకు రాష్ట్రానికి చెందిన నేతలనే ఎంపిక చేశారు.
ఏకగ్రీవ ఎన్నికే
తాజాగా భర్తీ చేయనున్న స్థానాన్ని మాత్రం ఏఐసీసీ కోటా కింద తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. కేకేకు రేవంత్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కింది. ఈ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభకు ఉప ఎన్నికలు జరగనున్న 12 స్థానా ల్లో.. 10 స్థానాలు వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఇటీవల లోక్‌సభకు ఎన్నికవడంతో ఖాళీ అయ్యాయి. ఇందులో అసోం, హరియాణా, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర నుంచి ఖాళీ అయిన స్థానాలున్నాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications