ట్రంప్ ఆదర్శం: ఎందుకో చెప్పిన అక్కినేని నాగార్జున

భారతీయులంతా కత్తులు నూరుతుంటే ట్రంప్ ఆదర్శమని సినీ హీరో అక్కినేని నాగార్జున అంటున్నారు. అయితే, ఎందులో ఆదర్శమనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు.

హైదరాబాద్: అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను భారతీయులంతా వ్యతిరేకిస్తున్నారు. తమ గుండెల్లో ఆయన రైళ్లు పరిగెత్తించడమే అందుకు కారణం. అయితే, ట్రంప్ ఆదర్శమని తెలుగు సినీ హీరో అక్కినేని నాగార్జున అంటున్నారు. అయితే, ఎందులో ఆదర్శమనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు.

ట్రంప్ తనకు ఆదర్శమని ఆయన అన్నారు. అభిప్రాయాల వ్యక్తీకరణలో ట్రంప్ తనకు ఆదర్శమని ఆయన మొహమాటం లేకుండా చెప్పేశారు. ప్రజలకూ తనకూ మధ్య అడ్డు గోడలు లేకుండా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడని, అవి ప్రజలకు చేరుతున్నాయని ఆయన అన్నారు.

Akkineni Nagarjuna says Trump is ideal

అదే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయానికి కారణమైందని కూడా నాగార్జున చెప్పారు. ఇప్పుడు ట్రంప్ స్పూర్తితో తాను కూడా ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యానని, మన గురించి ఎవరో చెప్పడం కన్నా మన సమాచారం సూటిగా ప్రజలకు మనమే చేరవేస్తే బాగుంటుందంటుందని ఆయన అంటున్నారు.

కాగా, నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ భక్తిరస చిత్రంలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హాధీరామ్ బావాజీ పాత్రలో ఆయన నటించారు. ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+