విద్యార్థులకు అలర్ట్.. నేడు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా...
తెలంగాణలో భారీ వర్షాలు కురస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు వర్సీటీల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు సోమవారం జరగాల్సిన పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే, వాయిదా పడిన పరీక్షలపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని అధికారులు వివరించారు. ఇక, రేపటి (సెప్టెంబర్ 3) నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ వీసీ వాకాటి కరుణ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేయూ పరిధిలోని అన్ని కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించడంతో పాటు సోమవారం జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి వివరించారు.

మంగళవారం నుంచి షెడ్యూల్ ప్రకారం యథావిధిగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇక, వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. వీటితోపాటు జేఎన్టీయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలను కూడా అధికారులు వాయిదా వేసారు.
బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 18, 16, 15, 13, - బీఫార్మసీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 17, 15, 13 సప్లిమెంటరీ, ఎంబీఏ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 22, 19 సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబర్ 5వ తేదిన నిర్వహిస్తామని రిజిస్టార్ వెంకటేశ్వర్లు వివరించారు. నేడు (సెప్టెంబర్ 2) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడినట్లు తెలపారు. 3వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథాతధంగా జరుగుతాయని అన్నారు.
విద్యా సంస్థలకు సెలవు...
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ సర్కారు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, పలు యూనీవర్సీటీల అధికారులు కూడా పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్రమంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications