హైదరాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్‌..

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్‌.. నేడు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్ ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. కావున‌, ఈ విష‌యాన్ని న‌గ‌ర‌వాసులు గ‌మ‌నించాల‌ని అధికారులు కోరారు. దాదాపు రెండున్న‌ర గంట‌ల‌కు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని విద్యుత్ అధికారులు తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌లకు విద్యుత్ అధికారుల‌కు షాకిచ్చారు. నేడు (గురువారం) సరూర్ నగర్ డివిజన్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్ప‌డుతుందని డీఈ కె.కె.రామకృష్ణ తెలిపారు. మన్సూరాబాద్11కేవీ ఫీడర్ పరిధిలోని మధురానగర్, ఆగమయనగర్ కాలనీ, అనితానగర్, మల్లికార్జున నగర్, మన్సూరాబాద్, భవాని నగర్, వివేకానంద నగర్ సమీప ప్రాంతాల్లో ఉదయం ప‌దిగంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Alert to the residents of Hyderabad Power cut in these areas today

మధ్యాహ్నం 3నుంచి 4:30 వరకు...

ఈ ప్రాంతాలతో పాటు న‌గ‌రంలోని సూర్యోదయకాలనీ, సరస్వతినగర్, మధురానగర్, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, హకీమబాద్ కాలనీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం ఒంటి వరకు కరెంట్ స‌ర‌ఫ‌రా ఉండదని అధికారులు తెలిపారు. అలాగే, సౌత్ ఎండ్ పార్క్ 11కేవీ ఫీడర్ పరిధిలోని మధురానగర్, భవానీనగర్, హిమపురి కాలనీ, చండీశ్వరి కాలనీ, శైలజాపురి కాలనీ, చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని న‌గ‌ర‌వాసులు గ‌మ‌నించ‌వ‌ల‌సిందిగా అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+