తన అరెస్ట్ పై అల్లు అర్జున్ అనూహ్య స్పందన - తేల్చేసారు..!!
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అంశం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ఈ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆసక్తికర పరిణామాల వేళ అల్లు అర్జున్ ను జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వటం ఈ ఉదయం ఇంటికి చేరు కొన్నారు. తన అరెస్ట్ పైన అల్లు అర్జున్ తొలి సారిగా స్పందించారు. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తన అభిమానులకు కీలక సందేశం ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యా రు. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ.. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ ఈ వ్యవహారం పై ఆచి తూచి స్పందించారు.

తాను బాగానే ఉన్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపి న అల్లు అర్జున్.. రేవతి గారి కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేసారు. జరిగిన ఘటన దురదృ ష్టకరంగా పేర్కొన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా అల్లు అర్జున్ వివరించారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఎక్కడా ఎవరినీ తప్పు బడుతూ అల్లు అర్జున్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.












Click it and Unblock the Notifications