దేశం అంతా అల్లు అర్జున్‌తో కనెక్ట్ అయింది అక్కడే

Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన భారీ బందోబస్తు మధ్య తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి, ఆ తరువాత ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సినీ ప్రముఖులు పోటెత్తారు. ఆప్యాయంగా పలకరిస్తోన్నారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

Allu Arjun released Quotes on Pushpa Star s T-shirt and hoodie have gone viral on social media

ఇంటికి చేరిన అల్లు అర్జున్‌ను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు పలకరిస్తోన్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టారు. ఆ సమయంలో సురేఖ సోదరుడు అల్లు అరవింద్ పక్కనే ఉన్నారు. చెల్లెలికి ధైర్యం చెప్పారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరోలు నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దర్శకుడు హరీష్ శంకర్.. .. అల్లు అర్జున్‌ను పలకరించిన వారిలో ఉన్నారు.

ఆ సమయంలో అల్లు అర్జున్ ధరించిన టీ- షర్ట్‌పై అక్షరాలు సోషల్ మీడియాను ఆకర్షించాయి. ఐకన్ అనే అక్షరాలు, దాని కింద స్టార్ అని ముద్రించి ఉండటం కనిపించింది. అంతకుముందు చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో ఆయన వేసుకున్న హుడీపై ఫ్లవర్ నహీ ఫైర్ హూ మై అనే పుష్ప డైలాగ్ హిందీలో రాసి ఉంది. ఈ డైలాగ్.. ఆయనను దేశం మొత్తం కనెక్ట్ చేసిందా మూవీతో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+