ఐకాన్ స్టార్ ఐతే ఏంటి?.. సీఎంకు అల్లు అర్జున్ సారీ చెప్పాల్సిందే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీనటుడు అల్లు అర్జున్ (Allu Arjun) వెంటనే క్షమాపణలు చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. శనివారం మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తాజాగా స్పందించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయి చర్చిస్తామని మంత్రి తెలిపారు. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం.. సినీరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Allu Arjun should apologize to CM Revanth Reddy Komatireddy Venkat Reddy

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని.. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలన్నారు. తొక్కిసలాటపై అసెంబ్లీ తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ, సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని మంత్రి అన్నారు.

పోలీసులు వద్దని చెప్పినా.. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. అరెస్ట్ సమయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారన్నారు. ఒక వ్యక్తి ప్రాణం పోవడం మామూలు విషయం కాదన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవన్నారు. తప్పు చేస్తే నటుడికైనా.. ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదన్నారు.

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేస్తే కేటీఆర్, హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. వారికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఒక వ్యక్తి ప్రాణం పోతే అరెస్టు చేయరా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్? సూపర్ స్టార్ అయితే ఏంటని నిలదీశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. పుష్ప-2కు 2 నుంచి 3వేల కోట్లు వచ్చాయంటున్నారని... రేవతి కుటుంబానికి రూ. 20 కోట్లు ఇస్తే ఏంటని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+