అల్లు అర్జున్ నేడే విడుదల: అరవింద్‌కు చంద్రబాబు ఫోన్
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టైన అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్‌ను శుక్రవారం సాయంత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు, తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పేపర్లు చంచల్‌గూడ జైలు అధికారులకు అందకపోవడంతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి వరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. అయితే, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లలో తప్పులు ఉండటంతో వాటిని జైలు అధికారులు తిరస్కరించారు.

అయితే, శుక్రవారం అర్ధరాత్రి హైకోర్టు బెయిల్ పేపర్లు చంచల్‌గూడ జైలు అధికారులకు అందాయి. వాటిని జైలు అధికారులు పరిశీలించారు. అయితే, అప్పటికే అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్‌ను విడుదల చేయనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 6 గంటల తర్వాత ఎప్పుడైనా అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులోని మంజీరా బ్యారక్‌ను అల్లు అర్జున్‌కు కేటాయించారు. శుక్రవారం రాత్రి ఆయన ఆ బ్యారక్‌లోనే ఉండి శనివారం ఉదయం విడుదల కానున్నారు. అంతకుముందు అల్లు అర్జున్‌కు టీ, స్నాక్స్ అందించారు జైలు అధికారులు. రాత్రి డిన్నర్ అందించినట్లు సమాచారం. మరోవైపు, చంచల్‌గూడ వద్ద అర్ధరాత్రి వరకు అల్లు అర్జున్ రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులను పోలీసులు అక్కడ్నుంచి పంపించివేశారు.
ఇది ఇలావుండగా, అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి విడుదలవుతారని చంచల్‌గూడ జైలు వద్ద వేచిచూసిన అల్లు అరవింద్ తీవ్ర అసంతృప్తి గురయ్యారు. బెయిల్ పేపర్లు జైలు అధికారులకు సరైన సమయంలో అందక అల్లు అర్జున్ విడుదల ఆలస్యం కావడంతో ఓ క్యాబ్‌లో అల్లు అరవింద్ జైలు వద్ద నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆయన వస్తారని పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఎదురుచూశారు.
అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ అరెస్టయిన నేపథ్యంలో అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై ఆందోళన చెందవద్దని చంద్రబాబు సూచించారు. మరోవైపు, అల్లు అర్జున్ అరెస్టు క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి దంపతులు, నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వెళ్లారు.












Click it and Unblock the Notifications